నిహారిక పై కన్నేసిన శింబు

Simbu want to remake Oka Manasu with NIharika

05:25 PM ON 29th June, 2016 By Mirchi Vilas

Simbu want to remake Oka Manasu with NIharika

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా నటించిన ఒక మనసు చిత్రం ఇటీవలే విడుదలై డివైడ్ టాక్ తో రన్ అవుతుంది. నాగ శౌర్య, నిహారిక జంటగా నటించిన ఈ చిత్రం సాఫ్ట్ లవ్ స్టోరీగా రూపొందింది. ఇక ఈ చిత్రంలో నిహారిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు తమిళ హీరోలు.. అందులో ఒకరు హీరో ధనుష్ అయితే.. మరొకరు శింబు.. ఒక మనసు సినిమాలో హీరో పొలిటికల్ లీడర్ గా ఎదిగే వ్యక్తిగా కనిపిస్తాడు. నేపథ్యం బాగుండడం.. ఫీల్ గుడ్ సినిమాగా ఇమేజ్ తెచ్చుకుంది కాబట్టి ఈ సినిమాను రీమేక్ చేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు శింబు..

ఇప్పటికే కోలీవుడ్ లో మన్మథుడిగా, బ్యాడ్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఇతగాడు.. ఈ సినిమాను రీమేక్ చేస్తే.. అందులో కూడా నిహారికాను నటింప చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.. ఇప్పటికే ఒక మనసు హక్కులకోసం భారీ ప్రయత్నాలే చేస్తున్నాడు. మరి ఒక మనసు సినిమాతో నిహారికా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో.. చూడాలి..

English summary

Simbu want to remake Oka Manasu with NIharika