మూడు పదుల సింహాసనం వెనుక తెలియని నిజాలు

Simhasanam Completes 30 Years

06:07 PM ON 21st March, 2016 By Mirchi Vilas

Simhasanam Completes 30 Years

సూపర్ స్టార్ కృష్ణ అంటే డేరింగ్ .. డేషింగ్ హీరో అని పేరు ...  తెలుగు సినీ చరిత్రలో ఎన్నో సాంకేతిక మార్పులకు నాంది పలికిన సూపర్ స్టార్ తొలిసారిగా దర్శకత్వం వహించడమే కాక, తెలుగు హిందీ భాషల్లో అందునా జానపదంలో, అందునా తొలిసారి తెలుగులో 70 ఎంఎం స్టీరియోఫోనిక్‌ సౌండ్‌తో తీసిన సినిమా  ‘సింహాసనం’.... తెలుగు సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు , విశేషాలు సొంతం చేసుకుంది. తెలుగులో తొలి కౌబాయ్‌ చిత్రాన్నీ, రంగుల్లో తొలి సినిమా స్కోప్‌ చిత్రాన్ని నిర్మించిన హీరో కృష్ణ తొలిసారిగా 70 ఎం.ఎం.లో ‘సింహాసనం’ సినిమా మరో సంచలనానికి తెరతీసింది. అగ్రహీరోగా విరామం లేకుండా సినిమాలు చేస్తున్న తరుణంలో కృష్ణ ఈ చిత్ర నిర్మాణం చేపట్టి, రెండు విభిన్న పాత్రలు పోషించడమే కాకుండా ఎడిటింగ్‌; దర్శకత్వ బాధ్యతలు కూడా స్వీకరించి కేవలం 53 రోజుల్లో రెండు భాషల్లో ఈ సినిమా తీయడం ఆయన సాహసానికి నిదర్శనం.కృష్ణ  సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు కార్యదక్షతకి, పక్కా ప్లానింగ్‌కీ దర్పణంగా నిలించింది.

మెగా బ్రదర్స్ కి జై కొట్టిన వర్మ

తెలుగు సినిమా చరిత్రలో నిలిచేలా సాంకేతికంగా ఆధునిక హంగులతో ‘సింహాసనం’ చిత్రాన్ని నిర్మించడానికి కృష్ణ ఖర్చు విషయంలో వెనుకాడలేదు. రూ. 40-50 లక్షల్లో సినిమా తీసే రోజుల్లో రూ. కోటి 20 లక్షల వ్యయంతో (ఇప్పుడు ఈ సినిమా తీయాలంటే రూ.100 కోట్లు కావాల్సిందే) చిత్రాన్ని నిర్మించడం విశేషం. అలాగే తెలుగు చిత్ర కథానాయకుడు హిందీ చిత్రానికి దర్శకత్వం వహించడం సింహాసనం హిందీ వెర్షన్ ‘సింఘాసన’తోనే ప్రారంభం అయింది. పైగా జానపద చిత్ర నిర్మాణం పూర్తిగా తగ్గిపోయిన ఆ రోజుల్లో కృష్ణ సాహసించి, ‘సింహాసనం’ నిర్మాణం చేపట్టి అనితర సాధ్యమైన రీతిలో నిర్మించారు. భారీ సినిమాకి నిజమైన నిర్వచనంలా నిలిచే ‘సింహాసనం’ తెలుగు చలనచిత్ర చరిత్రలోనే తొలిసారిగా అత్యధిక ప్రింట్ల (157)తో విడుదలైన సినిమాగా పేరొందింది.అలా సింహాసనానికి అడుగు పడింది ...

అవును అఫ్రిదితో సెక్స్ లో పాల్గొన్నా

జానపద చిత్రం తీయాలని కృష్ణకు ఎప్పటినుంచో కోరిక .. అయితే శ్రేయోభిలాషుల సూచనతో వెనక్కి తగ్గాడు.  పద్మాలయ సంస్థ హిందీ చిత్ర రంగంలోకి అడుగుపెట్టి అక్కడ విజయయాత్ర సాగిస్తున్న తరుణంలో జానపద కథను రెండు భాషల్లో నిర్మిస్తే ఎలా ఉంటుందా..? అనే ఆలోచన మళ్ళీ కృష్ణకి వచ్చింది.  అప్పటికే పద్మాలయ స్టూడియో పూర్తిగా సిద్ధమైంది. అందుకే ట్రయల్‌ బేసిస్‌గా అన్నట్టు హిందీలో ‘పాతాళభైరవి’ సినిమా జితేంద్ర, జయప్రద లతో నిర్మించారు. ఆ సినిమాకి ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ధైర్యం తెచ్చుకుని, తెలుగు, హిందీ భాషల్లో ‘సింహాసనం’ నిర్మాణానికి కృష్ణ శ్రీకారం చుట్టారు.

ఎందుకు నవ్వుతున్నావ్... టీవీ యాంకర్ ఫై షోయబ్ ఆగ్రహం

ఆమె నాతో ఒక రాత్రి గడిపితే 6 కోట్లు ఇస్తా

అన్నయ్య మీద రివేంజ్ తీర్చుకోడానికే  పిలిచాడా

1/12 Pages

చారిత్రక సంఘటనల నేపధ్యంగా ...

   ఈ చిత్రానికి రచనా బాధ్యతలు మహారథికి అప్పగించారు కృష్ణ. కొన్ని చారిత్రక సంఘటనల ఆధారంగా జానపద కథ తయారు చేశారాయన. చరిత్రకీ, జానపదానికీ కొంత దగ్గర సంబంధం ఉంది. కాకతీయుల చరిత్రలోని రుద్రమదేవి పాత్ర స్ఫూర్తితో హీరోయిన అలకనందాదేవి పాత్రనీ, గోన గన్నారెడ్డి ప్రేరణతో విక్రమసింహ సేనాపతి పాత్రను సృష్టించారు. చరిత్రలో రుద్రమదేవిని గోన గన్నారెడ్డి కాపాడినట్లు ఈ చిత్రంలో మహారాణి అలకనందని విక్రమసింహుడు రక్షిస్తుంటాడు. అలాగే మౌర్య సామ్రాజ్య కాలంలో చంద్రగుప్తుడి మీదకు విషకన్యను ప్రయోగిస్తాడు రాక్షసామాత్యుడు. ఆ ఎపిసోడ్‌ స్ఫూర్తితో ఈ సినిమాతో చందనగంధి పాత్రకు రూపకల్పన చేశారు మహారథి. చిత్రరచనతో పాటు నిర్మాత హనుమంతరావు సూచనపై విదూషకుడైన కుక్కుటేశ్వరుని పాత్రని పోషించారాయన. హిందీ వెర్షన్‌కి ఖాదర్‌ఖాన్ మాటలు రాశారు.

English summary

Tollywood Super Star Krishna's Super Hit Film Simhasanam Movie Completes 30 Years today.This was the first 70 MM movie in Telugu film industry.Simhasanam Movie was made both in Telugu and Hindi.This was one of the first super hit movie Telugu Film Industry.