శీతాకాలంలో పెదాలు సంరక్షించుకోండి ఇలా...

Simple remedies for Dry Skin

06:47 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Simple remedies for Dry Skin

చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారి పోయి పగిలి పోతుంది.ఇంక పెదవులు గురించి చెప్పవలసిన అవసరం లేదు. అతి సున్నితమైన పెదవులు చలికాలంలో అందవిహీనంగా తయారవుతాయి. దీనితో పాటు పగిలిపోయి బాదాకరంగా మారుతాయి. సాదారణంగా కనిపించే లక్షణాలు పొడిచర్మం,పెచ్చులు ఊడడం, పగుళ్ళు, మంట కందిపోవడం మొదలయిన సమస్యలు తలెత్తుతాయి. కొంత మందికి అలర్జీ వలన కావచ్చు, విటమిన్‌ లోపం వల్ల కావచ్చు, పొగత్రాగడం వలన, డీహైడ్రేషన్‌, సూర్యరశ్మివలన ఈ సమస్యలు తలెత్తుతాయి. వీటి బారి నుండి బయటపడడానికి ఇంట్లో ఉంటూనే కొన్ని ప్రకియల ద్వారా సులభంగా ఫలితాన్ని పొందవచ్చు. పొడిబారిన పెదవుల కోసం కొన్ని సులభమైన పద్దతులు ఉన్నాయి. అవేమిటో చూద్ధాం.

1. రోజ్‌ వాటర్‌ మరియు తేనె

ఈ రెండింటిని వాడడం వలన పెదాలు పగలవు, ఇది గొప్ప మాయిక్చరైజర్‌ లాగా పని చేస్తుంది. సున్నితమైన చర్మాన్ని అద్భుతంగా కాపాడుతుంది.

ఉపయోగించే విధానం:

 • ఒక గిన్నెలో ఒక స్పూన్‌ రోజ్‌వాటర్‌ మరియు ఒక స్పూన్‌ తేనె కలపాలి.
 • ఈ మిశ్రమాన్ని పెదవులకి రాసుకొని 15 నిమిషాలపాటు వదిలేయాలి.
 • తరువాత మంచి నీటితో కడిగేయాలి.
 • ఈ విధంగా రోజు చేయాలి. దాని ద్వారా మీ పెదాలు తొందరగా పునరుద్ధరించబడతాయి.

2. గ్రీన్‌ టీ

గ్రీన్‌ టీ ఆరోగ్యానికి చాలా మంచిది.దీన్ని రోజు సేవించడం వలన శరీరంలొ ఉన్న మలినాలను దూరం చేస్తుంది.శరీరాన్ని లోపల నుండి శుభ్రం చేస్తుంది. అలాగే ఇది సౌందర్య సాధనాలలో కూడా ప్రముఖపాత్ర వహిస్తుంది. తడి గ్రీన్ టీ బ్యాగ్ పొడిబారిన పెదవులకి మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. ఈ పద్దతి పాత కాలం నాటిది, ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ఉపయోగించే విధానం:

 • గ్రీన్ టీ బ్యాగ్ ని ఉపయోగించిన తరువాత పాడేయకుండా దాన్ని పెదాల మీద 4 నిమిషాల పాటు అద్డాలి.
 • ఇలా రోజు చేయడం వలన పెదాలు పొడిబార కుండా మంచి నిగారింపు సంతరించుకుంటాయి.

3. నిమ్మరసం

నిమ్మరసం వయస్సు పై బడడాన్ని మళ్ళిస్తుంది. దీనితో పాటు చర్మాన్ని మృదువుగా మార్చి కాంతి వంతం గా చేస్తుంది. దీన్ని వాడడం వలన సున్నితమైన పెదాలు మీ సొంతం అవుతాయి.

ఉపయోగించే విధానం:

 • చిన్ని గిన్నె లో ఒక టీ స్పూన్ పాలు తీసుకొని దానిలో 3 చుక్కలు నిమ్మరసం కలపాలి.
 • ఆ మిశ్రమాన్ని రిఫ్రీజ్జిరేటర్ లో ఒక గంట ఉంచి తరువాత బయటకు తీయాలి.
 • నిద్రపోయే ముందు ఆ మిశ్రమాన్ని పెదాలకు పట్టించాలి.
 • ఇలా 3 రోజులు చేయాలి తరువాత దాని ఫలితం మీకే తెలుస్తుంది.

4. పాల మీగడ

దీనిలో ఎక్కువ మోతాడు లో కొవ్వు ఉండడం వలన సహజమైన మాయిశ్చరైజర్ లాగా పని చేస్తుంది.

ఉపయోగించే విధానం:

తాజా పాల మీగడ ని తీసుకొని పెదవుల పైన రాసుకోవాలి అలా 10 లేదా 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి.

తరువాత దూది ని గోరువేచ్చని నీటి లో ముంచి పెదవులని శుబ్రపరుచుకోవాలి.

ఇలా రోజు చేయడం వలన జీవం లేని పెదాలు జీవం సంతరించుకుంటాయి.

5. ఆలొవెరా

ఇది సహజాసిద్దమైన ఔషదం. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అలర్జీ లను కూడా ఇది దూరం చేయగలదు, చర్మాన్ని మృదువుగా మార్చి కాంతి వంతం గా తీర్చిదిద్ధుతుంది.

ఉపయోగించే విధానం:

 • తాజా కలబంద ని తీసుకొని అందులోని లిక్విడ్ ని బయటకు తీయాలి.
 • ఆ ద్రవాన్ని కొంచం తీసుకొని పెదాలకి రాసుకొని కొంత సమయం వదిలేయాలి.
 • అది ఎండి పోయిన తరువాత నీటి తో శుబ్రపరచాలి.
 • ఇలా రోజు చేయడం వలన పగిలిన పెదాల నుండి ఉపశమనం లబిస్తుంది.

6. దోసకాయ

దోసకాయ పగిలిన పెదాలకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది మళ్లీ తిరిగి మామూలు స్థితి కి తీసుకువస్తుంది.

ఉపయోగించే విధానం:

 • దోసకాయని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ ముక్కలతో పెదాలపై మర్దన చేసుకోవాలి. దాని వల్ల దానిలో ఉండే రసం పెదాలకు బాగా అంటుకుంటుంది.
 • ఇలా 15 నుండి 20 నిమిషాల పాటు చేసి తరువాత చల్లని నీటి తో శుబ్రపరుచుకోవాలి.
 • ఈ విధం గా రోజు కి కొన్ని సార్లు చేయడం వలన తొందరగా ఉపశమనం లబిస్తుంది.

7. కొబ్బరి నూనె

ఇది అద్భుతమైన సహజసిద్దమైన చిట్కా. పగిలిన చర్మాన్ని బాగుచేయడం లో దీనికి సాటి ఏది లేదు. అనాదికాలం నాటి నుండి పాటించే పద్దతి. ఇది పగుళ్లను, పొడిబారిన చర్మం నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

ఉపయోగించే విధానం:

 • సహజ సిద్దమైన కొబ్బరి నూనె ను చేతిలోకి తీసుకొని మీ చూపుడు వేలి తో పెదాల పైన మర్దన చేసుకోవాలి.
 • ఈ పద్దతిని రోజు లో కుదిరినప్పుడల్లా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
 • అదేవిదంగా ఆవ నూనె ను లేదా ఆలివ్ నూనె కూడా ఉపయోగించవచ్చు.

8. పంచదార

పంచదార మృతకణాలను తొలగించడం లో అద్భుతం గా పని చేస్తుంది. ఇది పగుళ్లను నివారించడం లోను, తిరిగి సహజ సిద్దమైన చర్మాన్ని పునరుధ్దరించడం లో సహాయ పడుతుంది. అలాగే ఇది చర్మాన్ని మృదువుగాను కాంతి వంతముగాను తయారుచేస్తుంది.

ఉపయోగించే విధానం:

 • ఒక చిన్న గిన్నెలో కొంచం పంచదారని తీసుకోవాలి. దాంట్లో కొంచం అలివ్ నూనె ను వేసి బాగా కలపాలి.
 • ఈ మిశ్రమాన్ని పెదాల పైన 10 నిమిషాల పాటు మర్దన చేయాలి. అనంతరం గోరువేచ్చని నీటి తో శుబ్రపరుచుకోవాలి.

అదనపు చిట్కాలు

 1. డీహైడ్రేషన్ వలన సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఎక్కువ నీటిని సేవిస్తూ ఉండాలి. తగినన్ని ద్రవ పదార్ధాలు సేవించడం వలన ఈ సమస్య నుండి ఉపశమనం లబిస్తుంది.
 2. చర్మ సంరక్షణ ఉత్పత్తులు వాడేటప్పుడు, బాడీ స్ప్రే లను వాడేటపుడు జాగ్రత్త వహించాలి. అవి మీ శరీరానికి అనుకూలం గా ఉన్నాయా లేదా అని సరిచూసుకొని అనంతరం వాటిని ఉపయోగించాలి.
 3. బయటకు వెళ్ళేటప్పుడు తప్పని సరిగా పెదాలకి మాయిశ్చరైజర్ రాసుకొని వెళ్ళాలి. అలాగే బయట కాలుష్యం నుండి కాపాడుకోవడానికి స్కార్ఫ్ ముఖానికి దరించడం మంచిది.
 4. తాజా కాయగూరలు పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యముగా విటమిన్ ఎ,బి,సి,బి2 మరియు ఇ ఇంకా ఐరన్ కూడా ఉండేలా చూసుకోవాలి.
 5. ముక్కుతో గాలి పీల్చడం మంచిది. నోటి తో పీల్చడం వలన పెదాలు పొడి బారి పోతాయి.
 6. పెదాల మీద చర్మాన్ని గోటితో లాగడం పంటి తో కొరకడం మంచిది కాదు. అలా చేయడం వలన ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి.

English summary

Simple remedies for Dry Skin. Dry lips is a common problem that can be unattractive and painful.