బొద్దింకలను వదిలించుకోవటానికి ప్రభావవంతమైన చిట్కాలు

Simple ways to get rid of cockroaches

10:25 AM ON 12th March, 2016 By Mirchi Vilas

Simple ways to get rid of cockroaches

సాదారణంగా ప్రతి ఇంటిలో బొద్దింకలు ఉంటాయి. వాటిని ఎలా వదిలించుకోవాలో అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు. ఈ చిన్న జీవులు ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఇవి వ్యాధులను  కలిగించే వివిధ రకాల క్రిములు మరియు బాక్టీరియా వాహకాలుగా పనిచేస్తాయి. ఇవి పరిసరాల చుట్టూ కలుషితం చేయటమే కాకుండా అలెర్జీలకు కారణం అవుతాయి. మనం కొంచెం సమయాన్ని కేటాయిస్తే బొద్దింకలను వదిలించుకోవచ్చు. ఇప్పుడు బొద్దింకలను వదిలించుకోవటానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

1/11 Pages

1. బోరాక్స్ మరియు పంచదార

బోరాక్స్ బొద్దింక పెరుగుదల నియంత్రించడానికి మరియు ఇంటిలోకి ప్రవేశించకుండా నివారించటానికి సహాయపడుతుంది. బోరాక్స్ కీటకాల జీర్ణ వ్యవస్థను నష్టపరచి చనిపోయేలా చేస్తుంది. బొద్దింకను ఆకర్షించటానికి బోరాక్స్ తో పంచదారను కలపాలి.

* బోరాక్స్ మూడు భాగాలు మరియు చక్కెర ఒక భాగం కలపాలి.
* ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో బొద్దింకలు  ఎక్కువగా తిరిగే ప్రదేశంలో పెట్టాలి.
* మరుసటి రోజు అనేక బొద్దింకలు చనిపోవటం చూడవచ్చు.
* ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే బొద్దింకలు తగ్గిపోతాయి.

English summary

In this article, we have listed simple ways to get rid of Cockroaches. Make necessary efforts to keep your house, including kitchen and bathroom, clean to prevent the intruders from taking up residence. Keep your kitchen and bathroom as dry as you can.