ఎలుకల బెడదను వదిలించుకోండిలా

Simple Ways to Get Rid Of Mice Naturally

06:32 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Simple Ways to Get Rid Of Mice Naturally

ఇంటిలో ఎలుకలు పుస్తకాలు మరియు బట్టలను పాడుచేస్తాయి. అలాగే వాటి మూత్రం మరియు మలం ద్వారా అనేక అంటువ్యాధులు వస్తాయి. ఎలుకలతో విసుగు చెందినప్పుడు వాటిని ఎలా వదిలించుకోవాలో అనే ఆలోచనలో పడతాం. అయితే ఇక్కడ చెప్పుతున్న సులువైన మార్గాల ద్వారా ఎలుకలను వదిలించుకోవచ్చు.

1/11 Pages

1. పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్

పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ యొక్క బలమైన వాసన ఎలుకలకు పడదు. కాబట్టి అవి పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ ఉన్న ప్రదేశం నుండి పారిపోతాయి. ఎలుకలు ఇంటిలోకి ప్రవేశించగానే ఈ పద్దతిని ఉపయోగిస్తే ఎలుకలు దూరంగా పోవటానికి సహాయపడుతుంది.

కావలసినవి

  • పిప్పరమింట్ నూనె
  • కాటన్ బాల్స్

పద్దతి

* పిప్పరమింట్ నూనెలో కాటన్ బాల్ ని ముంచాలి.
* సాదారణంగా ఎలుకలు తిరిగే ప్రాంతంలో ఈ కాటన్ బాల్స్ ని ఉంచాలి.
* ఈ విధంగా చేస్తే ఎలుకలు ఇంటిలోకి రావు. ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి.
* అలాగే ఇంటి పెరటిలో పిప్పరమింట్ మొక్కలను పెంచితే ఎలుకలు ఇంటిలోకి రావు.

English summary

Simple Ways to Get Rid Of Mice Naturally. Here we have brought for you some of the best methods to keep mice away from your home naturally.