దెయ్యంగా మారిన 'సిమ్రన్‌'!!

Simran is acting as a Ghost

06:34 AM ON 15th December, 2015 By Mirchi Vilas

Simran is acting as a Ghost

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా పది సంవత్సరాల పైనే రాజ్యమేలిన సెక్సీ బ్యూటీ సిమ్రన్‌ ఆ తరువాత పెళ్లి చేసుకుని సినిమాలకి దూరంగా ఉన్నారు. కొంత గ్యాప్‌ తరువాత నాని నటించిన 'ఆహా కళ్యాణం' చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు తను లీడ్‌ క్యారెక్టర్‌లో నటిస్తూ మరి కొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సిమ్రన్‌ ప్రస్తుతం ఒక ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ పాత్రలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సిమ్రన్‌ భర్త దీపక్‌ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే మరో చిత్రానికి సిమ్రన్‌ సైన్‌ చేసింది.

ఇప్పటి వరకు ఇటువంటి పాత్రలో నటించని సిమ్రన్‌ ఈ చిత్రంలో దెయ్యంగా కనిపించనుంది. నూతన దర్శకుడు బాల చెప్పిన కధ, నా పాత్రను మలిచిన తీరు విపరీతంగా నచ్చాయి. అందుకే వెంటనే ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించాను అని సిమ్రన్‌ చెప్పింది. ప్రస్తుతం హారర్‌, థ్రిల్లర్‌ ఫార్ములా కధలే హిట్లు కావడంతో సిమ్రన్‌ కూడా ఈ తరహా కధనే ఎంచుకుని హిట్‌ కొట్టాలని భావిస్తుంది.

English summary

Simran is acting as a Ghost in new movie.