సింధుకు ఇప్పటి వరకు ఎన్నో కోట్లు వచ్చాయో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Sindhu got huge amount from different governments

03:56 PM ON 22nd August, 2016 By Mirchi Vilas

Sindhu got huge amount from different governments

పివి సింధు... ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది.. గత రెండురోజులుగా భారత దేశంలో పివి సింధు పేరు మార్మోగిపోతోంది. రియో ఒలింపిక్స్ లో మహిళల బాడ్మింటన్ లో రజత పతకం సాధించిన సింధుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తమ అభినందనలు సందేశాల రూపంలో పంపించారు. ఈ క్రమంలో దేశ యువతకు స్ఫూర్తినిచ్చిందంటూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెకు కాసుల వర్షం కురిపించాయి. వాటి వివరాల్లోకి వెళ్తే..

1/4 Pages

సింధుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నగదు బహుమతి ప్రకటించింది. దానితో పాటు హైదరాబాద్ లో ఆమె కోచింగ్ కు అనువుగా ఉండేలా వెయ్యి గజాల ఇంటి స్థలం ఇస్తామని తెలిపింది. సింధు కావాలంటే ఆమె అర్హతకు తగ్గ ఉద్యోగం ఇస్తామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 కోట్ల రూపాయల నగదు పురష్కారంతో పాటు, రాజధాని అమరావతిలో వెయ్యి గజాల స్థలం, గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామని తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నగదు పురష్కారం ప్రకటించింది. హర్యాణా ప్రభుత్వం 50 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించింది.

English summary

Sindhu got huge amount from different governments