బంగారు పతకానికి చేరువలో తెలుగమ్మాయి

Sindhu Storms Into Rio Olympics Final

12:11 PM ON 19th August, 2016 By Mirchi Vilas

Sindhu Storms Into Rio Olympics Final

రియోలో అద్బుత ప్రతిభతో జపాన్ క్రీడాకారిణి ఒకుహరను తెలుగుమ్మాయి సింధు ఓడించి, ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో భారత్ కు పతకం అందించిన ఐదో అమ్మాయిగా రికార్డులకెక్కింది. అంతేకాక ఒలింపిక్స్ లో భారత తరపున బ్యాడ్మింటన్ లో పతకం గెలిచిన అత్యంత పిన్నవయస్కురాలు సింధూనే కావడం గమనార్హం. అద్భుతమైన ఆటతీరుతో వరుస సెట్లతో ప్రత్యర్థిని మట్టి కరిపించిన సింధు ఒలింపిక్స్ లో స్వర్ణానికి ఒక్క అడుగుదూరంలో నిలిచింది. శుక్రవారం సాయంత్రం స్పెయిన్ క్రీడాకారిణి కోరోలినా మరిన్ తో తలపడనుంది. పోరు ఫలితంతో సంబంధం లేకుండానే భారత్ కు రజతం ఖాయమైంది. కాగా ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో భారత్ కు పతకం అందించిన మహిళల్లో వెయిట్ లిఫ్టిర్ కరణం మల్లేశ్వరి, బాక్సర్ మేరీకోమ్, షట్లర్ సైనా నెహ్వాల్ పతకాలు సాధించగా ఈ ఒలింపిక్స్ లో నిన్న రెజ్లర్ సాక్షి మలిక్, ఈరోజు తెలుగమ్మాయి పీవీ సింధు ఆ జాబితాలో చేరారు. గురువారం రాత్రి ఉత్కంఠ నడుమ సెమీ ఫైనల్స్ జరుగుతుంటే , సింధుని ప్రోత్సహిస్తూ క్రీడా మైదానంలో హర్షద్వానాలు చేసారు.

1/4 Pages

ప్రధాని నరేంద్రమోడీ అభినందన ...

అద్భుత ఆటతీరుతో రియోలో భారత్ కు మరో పతకం సాధించిపెట్టిన తెలుగమ్మాయి పీవీసింధుకు ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. తన ఆటతీరుతో భారత్ గర్వపడేలా చేశావని కొనియాడారు. ఫైనల్ పోరులోనూ ఇదే ఆటతీరుతో పోరాడి స్వర్ణంతో భారత్ లో అడుగుపెట్టాలని ఆంకాంక్షించారు. ఇక రియోలో భారత్ కు పతకం ఖాయం చేసిన సింధుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు జాతీయ, రాష్ట్ర నేతలు అభినందనలు తెలిపారు.

English summary

India’s P.V. Sindhu to reach the final of the women's singles event of badminton completion at the Rio Olympics.