'ఇండియన్ స్పీల్ బర్గ్' సింగీతం గురించి ఆసక్తికర విషయాలు

Singeetam Srinivasa Rao birthday special

05:23 PM ON 21st September, 2016 By Mirchi Vilas

Singeetam Srinivasa Rao birthday special

చిత్రసీమలో ప్రయోగాలు అన్నీ ఫలించవు. అలా అని వదిలిస్తే అసలు ప్రయోగమే అన్నది ఉండదు. అందుకే ఆయన చూపిన ప్రయోగం కొత్తపుంతలు తొక్కింది. మయూరి నాట్యాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. టాకీల కాలంలో పుష్పక విమానం అంటూ మూకీని తీసి మురిపించారు. 25ఏళ్ల కిందటే తెలుగు ప్రజలను టైమ్ మెషీన్ లో తీసుకెళ్లి మరీ భవిష్యత్తును చూపిన దర్శక బ్రహ్మ.. కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ తో చిత్ర పరిశ్రమ కళకళలాడుతున్న సమయంలో భైరవ ద్వీపం అంటూ జానపదాన్ని తెరపై ఆవిష్కరించిన ఇండియన్ స్పీల్ బర్గ్ సింగీతం శ్రీనివాసరావు పుట్టినరోజు ఈవేళ. 85ఏళ్ల ప్రాయంలోనూ నవ యువకుడిగా దూసుకుపోతున్న సింగీతం శ్రీనివాసరావుకి జన్మదిన శుభాకాంక్షలు.

1/15 Pages

తొలి గురువు అమ్మే..


నెల్లూరు జిల్లా గూడురులో జన్మించిన సింగీతం శ్రీనివాసరావు తల్లికి సంగీతంలో ప్రావీణ్యం ఉండటంతో అది ఈయనకు అబ్బింది. దీంతో చిన్నతనం నుంచే నాటకాలు, పాటలు పాడుతుండేవారు అదే.. సింగీతాన్ని సినిమాలవైపు మళ్లించింది. సాలూరి రాజేశ్వరరావు స్వరపరిచిన పాట పాడుమా...! ఆఁ.. కృష్ణా.. పలుకు తేనెనొలుకు మా..! అనే పల్లవితో సాగే పాట అంటే ఎంతో ఇష్టమట.

English summary

Singeetam Srinivasa Rao birthday special