మధుప్రియ తండ్రి మల్లేశ్‌ అరెస్ట్‌

Singer madhupriya father arrest by uppal police

01:10 PM ON 15th March, 2016 By Mirchi Vilas

Singer madhupriya father arrest by uppal police

మధుప్రియ, శ్రీకాంత్‌ ల గొడవ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మధుప్రియ ని శ్రాకాంత్‌ టార్చర్‌ చేస్తున్నాడని పోలీసులకు పిర్యాదు చేసింది. ఆ తరువాత మధుప్రియకి శ్రీకాంత్‌ కి కౌన్సెలింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మధుప్రియ తండ్రిని హైదరాబాద్‌ ఉప్పల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసారు. సింగర్‌ మధుప్రియ భర్త శ్రీకాంత్‌ అనుకుని మహ్మద్‌ నయీమ్‌ అనే వ్యక్తిపై దాడి చేసిన కారణంగా మధుప్రియ తండ్రి పెద్ద మల్లేశ్‌ ని అదుపులోకి తీసుకున్నారు ఉప్పల్‌ అధికారులు. మంగళవారం నాడు మల్లేశ్‌ తోపాటుగా దాడిలో పాల్గొన్న మరో ముగ్గురిని అరెస్టు చేసారు.

వివరాల్లోకి వెళితే శనివారం రాత్రి మధుప్రియ భర్త శ్రీకాంత్‌ అనుకుని ఆమె తండ్రి, బంధువులు రామాంతపూర్‌ కు చెందిన మహ్మద్‌ నయీమ్‌ అనే 30 ఏళ్ళ వ్యక్తిని చితకబాదిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో నయీమ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడు రాత్రి 3 గంటల సమయంలో మెడికల్‌ షాప్‌కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని వస్తుండగా మధుప్రియ అనుచరులు 14 మంది దాడి చేసారు. 20 నిమిషాల పాటు దాడి చేసారని మహ్మద్‌ ఉప్పల్‌ పోలీసులకు పిర్యాదు చేసాడు. పోలీసులు విచారణ చేపట్టి దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై మధుప్రియ తండ్రి విచారణ వ్యక్తం చేసాడు. పొరపాటుకు చింతిస్తున్నామని మధుప్రియ తల్లి బహిరంగ క్షమాపణ కోరిన విషయం తెలిసిందే.

English summary

On Saturday night, Madhupriya's father Pedda Mallesh and other relatives mistook a person to be Srikanth and roundly thrashed him. Based on Nayeem's complaint, the Uppal police arrested Pedda Mallesh.