మా ఆయన మంచోడు : మధుప్రియ

Singer  Madhupriya says my husband is good

04:16 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Singer  Madhupriya says my husband is good

సింగర్‌ మధుప్రియ, శ్రీకాంత్‌ వీరిద్దరి మధ్య వివాదం తెలిసిందే. ఇప్పుడు వీరిరువురు రాజీకి వచ్చారు. హుమాయూన్‌ పోలీసుల ఆద్వర్యంలో మానసిక వైద్యులు దాదాపు నాలుగు గంటల పాటు వీరికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మధుప్రియ మరియు శ్రీకాంత్‌ వీరిద్దరితో 4 గంటలు విడివిడిగా మాట్లాడారు. పోలీస్‌ స్టేషన్‌ నుండి బయటకు వచ్చిన మధుప్రియ విలేకరులతో మాట్లాడుతూ, మొదటి కౌన్సెలింగ్‌ పూర్తయిందని కొన్నాళ్లు కలిసి ఉండాలని పోలీసులు చెప్పారని ఆమె తెలిపింది. అప్పటికీ అతడి తీరు మారక పోతే రెండో దశ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని పోలీసులు అన్నారని ఆమె తెలిపారు.

ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రులతో పాటే ఉండాలని అనుకుంటున్నట్లు మధుప్రియ తెల్పింది. కౌన్సెలింగ్‌ తరువాత శ్రీకాంత్‌ పై మీ అభిప్రాయం ఏంటి అని అడిగిన మీడియాకి అతను మంచివాడు అని చెప్పి వెళ్ళిపోయింది. భర్త వేధిస్తున్నాడంటూ మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

వివరాల్లోకి వెళితే ముగ్గురు సైకాలజిస్టులతో కౌల్సెలింగ్‌ నిర్వహించారు హుమాయూన్‌ పోలీసులు. కౌన్సెలింగ్‌ తరువాత పోలీసులు మీడియాతో మాట్లాడారు. మధుప్రియ షాక్‌లో ఉన్నానని, ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని కౌన్సెలింగ్‌ తరువాత ఆమె చెప్పిందని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం తన భర్త శ్రీకాంత్‌పై ఎటువంటి లీగల్‌ యాక్షన్‌ అవసరం లేదని తల్లిదండ్రులతో కలిసి ఉంటానని గోదావరి ఖనికి వెళ్ళిపోతానని ఆమె చెప్పిందని పోలీసులు తెలిపారు. కౌన్సెలింగ్‌ చేసిన తరువాత ఆమె ఒక అవగాహనకు వచ్చిందని చెప్పారు. మధుప్రియను శ్రీకాంత్‌ వేధించిన విషయం నిజమేనని అన్నారు. మధుప్రియ తనతో పాటు ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆమె భర్త శ్రీకాంత్‌ వ్యక్తం చేసాడని పోలీసు అధికారులు తెలియజేసారు.

1/6 Pages

మధు ప్రియ ఆగస్ట్ 26, 1997 న మల్లేష్ సుజాత దంపతులకు జన్మించింది.

English summary

Singer Madhupriya complained against her husband in Humayun Nagar Police station, faced the counselling from the police officials. Finally she says her husband srikanth is good.