భర్త గుట్టు విప్పిన మధుప్రియ

Singer Madhupriya speaks to media about her husband

03:38 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Singer Madhupriya speaks to media about her husband

సింగర్‌ మధుప్రియ చిన్నవయస్సులోనే మంచి గుర్తింపు పొందింది. మధుప్రియ ఆరు నెలల క్రిందట తల్లి దండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సంవత్సరం కూడా పూర్తి కాకుండా వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. ఆమె భర్త వేధిస్తున్నాడంటూ శనివారం హుమాయూన్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత మధుప్రియ మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

“అమ్మాయిలు అమ్మానాన్న చెప్పినట్టు వినకపోతే జీవితం నాలాగే సంకనాకిపోతుంది. అమ్మానాన్నలు ఒప్పుకుంటేనే పెళ్ళి చేసుకోవాలి. మీడియా తరుపున పెద్ద క్షమాపన కోరాల్సింది మా అమ్మకి మా నాన్నకి నా లైఫ్‌లో నాకు తెలిసి.. నా జీవితాంతం వాళ్ళు తోడుంటారు. శ్రీకాంత్‌ ని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాను. ఇంత స్టార్‌డమ్‌ ఉండి కూడా ఒక అబ్బాయి చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. పెళ్ళైన మూడు నెలలు చాలా హ్యాపీగా ఉన్నాను తరువాత మూడు నెలలు టార్చర్‌ అనుభవించాను. గత మూడు నెలలుగా ఆస్తి తీసుకురావాలని నిత్యం వేధిస్తూ చిత్ర హింసలు చేసాడు. ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఈ ఆరునెలల జీవితం 60 ఏళ్ళ మైండ్‌ సెట్‌ ఇచ్చింది. 60 ఏళ్ళు నేను స్ట్రాంగ్‌గా బతకగలను ఒక అమ్మాయిగా.. ఈ సందర్భంగా అందరికీ క్షమాపణలు కోరుతున్నాను ముఖ్యంగా మా ఇంట్లో వాళ్ళకు. ఇలాంటి నీచపు మనుషులు ఉన్నంత కాలం సమాజం మారదు. ఆడపిల్లలకు స్వేచ్చ ఉండదు." అని మధుప్రియ చెప్పింది.

ఆస్తి ఇవ్వనంటే కమీషనర్‌ దగ్గరకు వెళ్ళి కేసు పెడతాం అన్నాడు. వాడికి పైసా సంపాదన లేదు ఆరు నెలలుగా నేనే పోషించాను. నన్ను ఇప్పటికీ మా ఇంట్లో వాళ్ళు బంగారు తల్లిలాగ చూసు కుంటారు. మా తల్లిదండ్రులు ఎప్పుడూ నన్ను ఏం అనలేదు. నేను చాలా దెబ్బలు తిన్నా నా జ్ఞాపకశక్తి కూడా తగ్గింది. ఇలా మీడియాతో మాట్లాడుతూ మధుప్రియ స్పృహ తప్పి పడి పోయింది.

ఇదిలా ఉండగా మరో వైపు ఆమె భర్త ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు. శ్రీకాంత్‌ ఆమెను ఏనాడు కొట్టలేదని నిరూపిస్తే దేనికైనా రెడీ అని టీవి చానల్స్‌ తో మాట్లాడుతూ అన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Singer  Madhu Priya complained to the police that her husband is tortured her since some time.  Singer Madhu Priya who has married Srikanth against her parents wishes after much controversy has complained against her husband in Humayun Nagar police station.