చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న సింగర్

Singer Sapna Choudhary attempted suicide

10:51 AM ON 8th September, 2016 By Mirchi Vilas

Singer Sapna Choudhary attempted suicide

సోషల్ మీడియా ప్రభావం అందరిపై ఏ ప్రభావం చూపిస్తుందో తెలీదు కానీ ఇప్పటి వరకైతే చాలా మంది ప్రాణాలు పోవడానికి పరోక్షంగా కారణం అయింది. మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతోందనే వాదన వుంది. తాజాగా ఢిల్లీకి చెందిన ఒక ఫోక్ సింగర్ ఆత్మహత్యాయత్నం చేసింది దానికి కారణం వాట్సాప్ కావడం విశేషం. వివరాల్లోకి వెళితే... నైరుతి హర్యానాకు చెందిన ఫోక్ సింగర్, డాన్సర్ సప్నా చౌదరి ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను పాడిన కొన్ని పాటల్లో కొన్ని పదాలు దళితులను కించపరిచేలా ఉన్నాయని కున్వార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీనిపై పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు సప్నపై ఏస్సి, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదే విషయాన్నీ సదరు వ్యక్తి సోషల్ మీడియాలో అదే పనిగా సప్నపై దుష్ప్రచారం చేయడంతో మనస్థాపానికి గురైన సప్న, తన ఇంట్లోనే ఉన్న ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. సప్న ఇంట్లో దొరికిన ఒక లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: నాన్ వెజ్ తిని గుడికి వెళ్ళొచ్చా?

ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో చనిపోయిన మనిషిని ఏం చేస్తారో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: కాకి తల మీద వాలితే చనిపోతారా?

English summary

Singer Sapna Choudhary attempted suicide. Haryana female singer Sapna Choudhary attempted suicide due to police case on her.