ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నా(వీడియో)

Singer Sunitha about her personal life

04:55 PM ON 1st September, 2016 By Mirchi Vilas

Singer Sunitha about her personal life

స్వీట్ సింగర్ సునీత తన వ్యక్తిగత విషయాలను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది. తన భర్త తనకు ముందు ప్రపోజ్ చేసాడని.. తమది ప్రేమ వివాహమని చెప్పింది. దానికి తాను ఒకటి, ఒకటిన్నర ఏడాది తరువాత ఒప్పుకున్నానని చెప్పింది. పెళ్లి కూడా అనుకోకుండా అలా జరిగిపోయిందని.. అప్పుడు తన వయసు 19 ఏళ్ళు అని చెప్పింది. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నామని చెప్పింది. ఇప్పుడు జీవితంలో అంతా బానే ఉందని.. వెనక్కి తిరిగి ఎప్పుడూ చూసుకోనని చెప్పింది. జరిగినది అంతా ఒక అనుభవం లాగా తీసుకుంటానని చెప్పింది.

తనకు బాధ కలిగినప్పుడు ఏడుస్తానని.. పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమంలో తనకు పాడే అవకాశం వచ్చిందని.. సాయిబాబాతో 25 నిమిషాలు మాట్లాడి.. ఆ రోజు రాత్రి విపరీతంగా ఏడుపు వచ్చిందని తెలిపింది. అది సొంతోషమో, బాధో తెలియదని చెప్పింది. తెలుగులో ట్రెండ్ మారిందని.. అందుకే తనకు అవకాశాలు తగ్గాయేమో అని చెప్పింది. తనకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయని.. రామ్ గోపాల్ వర్మ, ఎస్.వి కృష్ణా రెడ్డిలు తమ సినిమాలలో చేయమని అడిగారని.. అయితే తనకు ఇష్టం లేక వెళ్లలేదని చెప్పింది.

ఇది కూడా చదవండి: మీరు బంగారు ఉంగరాలు పెట్టుకుంటున్నారా? అయితే ఇది చదివాక వెంటనే తీసేస్తారు!

ఇది కూడా చదవండి: పాపం హిజ్రాలను బట్టలూడదీసి కొట్టారు(వీడియో)

ఇది కూడా చదవండి: ఫ్రెండ్ కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్న అమల

English summary

Singer Sunitha about her personal life. Sweet singer Sunitha talks about her personal life in Open Heart with RK programme.