పవన్ కి పిన్నిగా సింగర్ సునీత.. ఏ సినిమాలో తెలుసా?

Singer Sunitha is acting as a mother with Pawan Kalyan

03:25 PM ON 12th July, 2016 By Mirchi Vilas

Singer Sunitha is acting as a mother with Pawan Kalyan

సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసిన కోకిల గొంతు సునీత ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి రెడీ అవుతోందట. అనామిక చిత్రంలో కనిపించిన సునీత మనందరికీ గుర్తే కదా. తెరవెనుక గొంతుక వినిపించడానికి ఎక్కువ ఇష్టపడే సునీత ఇప్పుడు మరోమారు సినిమాలో కనిపించనుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శ కత్వంలో పవన్ హీరోగా రానున్న మూవీలో సునీతను కీలక పాత్రకు ఎంపిక చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఇప్పటికే సునీతను కల్సి, పాత్ర గురించి వివరించినట్లు బోగట్టా.

పాత్ర తక్కువ నిడివి అయినా, ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందని అంటున్నారు. అందుకే పవన్ కి పిన్నిగా కనిపించనుందట. మరి అన్నీ ఒకే అయితే, టాలీవుడ్ కి మరో పిన్ని దొరికినట్టే.

English summary

Singer Sunitha is acting as a mother with Pawan Kalyan