కెసిఆర్ కి  గాయని  సుశీల అభినందన ....

Singer Suseela Praises KCR

06:04 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Singer Suseela Praises KCR

అయుత చండీయాగాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ని పలువురు ప్రముఖులు అభినందనలతో ముంచెత్తేస్తున్నారు. తాజాగా ప్రముఖ నేపధ్య గాయని పి.సుశీల సోమవారం సిఎమ్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అయుత చండీయాగాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ , ముఖ్యమంత్రిని ఆమె మనసారా అభినందించారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాలువకప్పి సన్మానించారు. దేశం గర్వించ దగ్గ గాయని పి.సుశీల అని కేసీఆర్‌ ప్రశంసిస్తూ, అనంతరం సీఎం తన సతీమణి శోభ, ఇతర అధికారులకు సుశీలను పరిచయం చేశారు.

English summary

Famous Singer suseela praises telangana cheif minister Kcr for conducting "Ayutha Chandi Yagam" sucerssfully.