'సింగం -3' కి ముహూర్తం ఫిక్స్‌!

Singham -3 movie shooting date fixed

02:02 PM ON 31st December, 2015 By Mirchi Vilas

Singham -3 movie shooting date fixed

తమిళ స్టార్‌ హీరో సూర్యకి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ఉంది. అందుకే సూర్య నటించిన ప్రతీ చిత్రాన్ని తెలుగు కూడా డబ్‌ చేసి విడుదల చేస్తారు. అయితే 2010లో వచ్చిన 'యముడు' చిత్రం మాత్రం సూర్య ఇమేజ్ ని రెండింతలు పెంచేసింది. అప్పుటి వరకు తెలుగు, తమిళంలో మాత్రమే క్రేజ్‌ ఉన్న సూర్య మలయాళం, కన్నడ భాషల్లో కూడా క్రేజ్‌ సంపాదిచుకున్నాడు. ఆ తరువాత దీనికి సీక్వెల్‌ గా వచ్చిన 'సింగం -2' కూడా సూపర్‌ హిట్‌ అయింది. ఇప్పుడు తాజాగా దీనికి మరో సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ని వైజాగ్‌లో నెల రోజులు పాటు చిత్రీకరిస్తామని చెప్పారు.

అయితే ఈ షూటింగ్‌ డిసెంబర్‌లోనే జరగాల్సి ఉంది. కానీ సూర్య 'పసంగ' చిత్రంతో బిజీగా ఉండటంతో ఆ షూటింగ్‌ని పోస్ట్‌పోన్‌ చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు 'పసంగ' రిలీజ్‌తో సూర్య సింగం-3 పై దృష్టి పెట్టాడు. జనవరి 7 నుండి సింగం -3 మొదటి షెడ్యూల్‌ వైజాగ్‌ లో నెల రోజులు పాటు జరుగుతుంది. ఆ తరువాత రెండో షెడ్యూల్‌ని తమిళనాడుకి షిఫ్ట్‌ చేస్తారు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ పార్ట్‌లో అనుష్క, శృతిహాసన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

English summary

Singham -3 movie shooting starts on January 7th in vizag.