ప్రపంచం అంతమై పోతుందా? (వీడియో)

Sinkhole With Swirling Water Appears in Australia

11:01 AM ON 9th August, 2016 By Mirchi Vilas

Sinkhole With Swirling Water Appears in Australia

ఈమాట చాన్నాళ్ల నుంచి వినిపిస్తున్నదే. యుగాంతం అవుతోంది, ప్రపంచం అంతమై పోతుంది వంటి మాటలు ఎందరో చెబుతూనే వున్నారు. అయితే ఈ వీడియో చూస్తే, నిజంగానే ప్రపంచం అంతమవుతుందని బిత్తరపోతారు. ప్రపంచం అంతమైపోతుందా అని అనుమానపడడం, భూకంపం వచ్చిందా అని సందేహాయించడం సహజం. ఇక అక్కడి వారంతా కూడా సరిగ్గా ఇలానే అనుకున్నారట. అసలు విషయంలోకి వెళదాం.

ఆస్ట్రేలియాలోని ఓ ఇంటి ప్రాంగణంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. వారి ఇంటి వెనకభాగంలో ఒక ఇంకుడు గుంట లాంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అయితే ఒక రోజు ఉన్నట్టుండి ఆ గుంట పెద్దదిగా మారటం మొదలయ్యింది. దాంతోపాటు నీళ్లు కూడా సముద్రంలో వచ్చే అలల మాదిరిగా ఎగసి పడ్డాయి. ఈ సన్నివేశాన్ని గమనించిన ఆ ఇంటివారు బెంబేలెత్తిపోయారు.

యుగాంతం వచ్చిందా, భూకంపమా లేక ఇంకేమైనానా అని ఆలోచిస్తూనే ఉండిపోయారట. మొదట ఈ దృశ్యాన్ని చూసిన పక్కింటి వ్యక్తి వాళ్ల బిల్డింగ్ పై నుంచి వీడియో తీశాడు. అటుపై యజమానులకు విషయం తెల్పాడు. 8 మీటర్ల వరకూ పెరిగిపోవడంతో వెంటనే స్థానిక అధికారులకు సమాచారమిచ్చారు. ఈ విచిత్ర ఇంకుడు గుంటకు భూమి లోపల చాలా వరకు ఖాళీ ప్రదేశమున్నట్టు ప్రాధమికంగా గుర్తించారు. అందువల్లే త్వరగా గుంట పెద్దదిగా మారితోందని వివరించారు.

అయితే మైన్స్ కు సంబంధించి తవ్విన పాత సొరంగం లాంటిది ఏదైనా అక్కడ ఉండి ఉంటుందని కూడా అనుమానించారు. భూగర్భ నీటి డ్రైనేజ్ సిస్టమ్ ను మార్చే సందర్భంలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయట. నీటిని కొత్త మార్గంలోకి మళ్లించే క్రమంలో, భూ ఉపరితలం మార్పులకు గురైనప్పుడు, దగ్గర్లో చెరువు లాంటివి త్రవ్వినప్పుడు కూడా ఇలా జరగొచ్చట. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి దగ్గర్లో ఒక కాలువ కూడా ఉందట.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటుచసుకుంది. పెద్ద గుంటలు ఏర్పడినట్టు వార్తలు వచ్చాయి. విషయం ఏమంటే, ఇలాంటి సంఘటనలు భారీగా వరదలు వచ్చినప్పుడు తరచుగా జరుగుతుంటాయి. పెద్ద ఎత్తున భూమి కోసుకుపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మొత్తానికి అందరినీ భయపెట్టిన ఈ ఘటన వీడియో ను మీరు చూడండి.

ఇవి కూడా చదవండి:పుష్కర ఆహ్వానంతో సంపూ .. కేక

ఇవి కూడా చదవండి:రాజమౌళికన్నా అక్కినేని యంగ్ బాయ్ కి అనసూయ ముఖ్యమా?

English summary

A big Sinkhole with Swirling water appeared in Australia and some one near by people taken the whole thing in a video and they kept that video in Internet and the people around that was getting fear by seeing that Sinkhole.