నిజం చెప్పినా లాగిపెట్టి కొట్టారట... ఇంతకీ సిరివెన్నెల చేసిన తప్పేంటి?

Sirivennela Sitarama Sastry about his old memories

12:28 PM ON 6th October, 2016 By Mirchi Vilas

Sirivennela Sitarama Sastry about his old memories

సత్యం పలకాలి అని పెద్దలు చెబుతారు. కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి అలా నిజం చెప్పినా దెబ్బలు తినాల్సి వచ్చిందట. ఇంతకీ ఎవరు ఎందుకు కొట్టారో, అసలు ఈయన చేసిన పనేంటో వంటి వివరాల్లోకి వెళ్తే... సిరివెన్నెల అనగానే మనకు మాంచి సంగీత ప్రధానమైన ఆర్ట్ ఫిలిం లాంటిది గుర్తొస్తుంది. అవును కళా తపస్వి కె. విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల చిత్రంలో తాను పాటల రచయితగా, కవిగా పరిచయమైన సీతారామ శాస్త్రి ఆ సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న పాటల మాంత్రికుడు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని తిట్టి గాయం చేసినా, అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా అని ప్రశ్నించినా.. జరుగుతున్నదీ జగన్నాటకమంటూ దశావతారాల ఆంతర్యం వివరించినా ఆయనకే చెల్లింది. సిరివెన్నెల సినిమా నుంచి ఇప్పటికీ తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

1/4 Pages

ఆయన తండ్రి ఓ రోజు కొట్టారట. దానికి కారణమేంటో ఆయన మాటల్లోనే ఇలా వుంది. వాస్తవానికి మహాత్ముడంటే సత్యం, అహింసకు మారుపేరు. గాంధీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముడి ప్రభావం తన కుటుంబంపై ఎలా ఉండేది? దాని వల్ల ఆయన ఎందుకు దెబ్బలు తినాల్సి వచ్చిందో వివరించారు. మా నాన్న గారికి గాంధీజీ అంటే అమితమైన ఇష్టం, అభిమానం. ఆయనకు అబద్ధం చెబితే పట్టరాని కోపం వచ్చేస్తుంది. కానీ, చేసిన తప్పును ఒప్పుకొని నిజం చెబితే క్షమించేసేవారు. కాబట్టి అబద్ధం చెప్పి తల దించుకునే కన్నా, నిజం చెప్పి తల ఎత్తుకుని నిలబడడమే బాగుండనిపించింది. అయితే ఒకసారి నిజం చెప్పినా మా నాన్న నన్ను కొట్టారు.

English summary

Sirivennela Sitarama Sastry about his old memories