యువతికి టీ లో మత్తు మందు కలిపి...సోదరుడితో అత్యాచారం చేయించింది .. ఆపై ...

Sister Supported Her Brother For Rape in Faridabad

11:24 AM ON 22nd August, 2016 By Mirchi Vilas

Sister Supported Her Brother For Rape in Faridabad

తప్పని చెప్పాల్సిన వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. ఫలితంగా యువతులు అత్యాచారానికి గురవుతున్నారు. సరిగ్గా ఓ యువతి విషయంలో ఓ మృగాడి చెల్లెలు ఇలానే చేసింది. ఫరీదాబాద్ నగరానికి చెందిన ఓ యువతి సల్మాన్ అనే యువకుడి సోదరిని కలిసేందుకు వచ్చింది. ఇంటికి వచ్చిన యువతికి సల్మాన్ సోదరి మత్తు మందు కలిపిన టీ ఇచ్చింది. టీ తాగిన యువతి అపస్మారక స్థితిలోకి చేరడంతో ఆమె పై సల్మాన్ అత్యాచారం చేశాడు. రేప్ చేసిన మరునాడు సల్మాన్ తన బంధువులు, స్నేహితుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం సల్మాన్ యువతితో ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులు వారిని బయటకు తరిమేశారు. దీంతో అద్దె గదిలో సల్మాన్ యువతితో కొంతకాలం కాపురం చేశాక, ఆమెను ఒంటరిగా వదిలి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు. దీంతో మత్తు మందు ఇచ్చి అత్యాచారం జరిపి, ఆపై ఉత్తుత్తి పెళ్లి చేసుకొని వాడుకొని వదిలివేసిన సల్మాన్ పై, దీనికి సహకరించిన అతడి సోదరిపై, పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ఫరీదాబాద్ పోలీసులు సోదరి, సోదరులపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:గ్రామస్థుల మధ్య కొట్లాటకు దారితీసిన సీరియల్!

ఇవి కూడా చదవండి:పతకం రాలేదని బట్టలు విప్పేసారు (వీడియో)

English summary

A Girl went to meet her friend and her friend gave tea which was mixed with drugs and later her friend's brother Salman raped her. Later he married her and now he left her in a house because of salman parents rejected his marriage and now the victim filed a case against on him and Delhi Police filed case on the brother Salman and his sister.