'శివగామి' ట్రైలర్ వచ్చేసింది(వీడియో)

Sivagami trailer

12:34 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Sivagami trailer

ఒక్కోసారి ఒక్కో శకం నడుస్తుంది. ఇప్పుడు కామెడీ జోడించి తీసే హారర్ సినిమాల జోరు నడుస్తోంది. ఈ మధ్య హారర్ కామెడీతో వచ్చిన ప్రేమకథాచిత్రమ్ ఘన విజయం తర్వాత తెలుగులో హారర్ నేపథ్యంలో వచ్చే సినిమాలకు డిమాండ్ బానే పెరిగింది. అందుకే తాజాగా.. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో.. గుజరాత్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఓ హారర్ ఎంటర్టైనర్ సినిమా రూపొందుతోంది. తెలుగులో శివగామి పేరుతో, కన్నడలో నాని పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ భీమవరం టాకీస్ పతాకం పై శివగామి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

మనీష్ ఆర్య, ప్రియాంకరావు ముఖ్య పాత్రధారులుగా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటి సుహాసినీమణిరత్నం ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ లాబ్ లో జరిగింది. ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ముందుగా శివగామి చిత్రం మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా గుంటూర్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. సాంగ్ టీజర్స్ ను ప్రముఖ నటి కవిత, సెన్సార్ బోర్డ్ మెంబర్ నాగులపల్లి పద్మిని, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్, రామకృష్ణ గౌడ్, అల్లాణి శ్రీధర్ రిలీజ్ చేసారు.

English summary

Sivagami trailer