పవన్ తో సీక్రెట్ గా భేటీ అయిన శివాజీ !

Sivaji Secret Meeting With Pawan Kalyan

10:47 AM ON 8th September, 2016 By Mirchi Vilas

Sivaji Secret Meeting With Pawan Kalyan

ప్రస్తుతం ఎవరి నోట విన్నా, ఏపీకి ప్రత్యేక హాదా వస్తుందా, రాదా? అనే మాటే. ఏపీకి ప్రత్యేక హోదా గురించి పోరాటం చేయనున్నట్టు తిరుపతి బహిరంగ సభలో పవన్ ప్రకటించిన తర్వాత ఢిల్లీలో కదలిక మొదలైంది. ఒక్కసారిగా హోదా హీట్ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇక పవర్ స్టార్ పవన్ కంటే ముందే టాలీవుడ్ హీరో శివాజీ ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు, ఏపీ ప్రత్యేక హోదా సాధన కమిటీ గౌరవ అధ్యక్షుడిగా శివాజి ఉన్నాడు.

ఈ మధ్య కొంత వెనక్కి తగ్గినా, పంధా మాత్రం మారలేదు. ఇక ఇప్పుడు శివాజీకి పవన్ నుంచి ఫోన్ కాల్ వెళ్లిందట. పవన్ ఆహ్వానం మేరకు సీక్రెట్ గా పవన్ ని కలిసినట్లు వార్తులు గుప్పుమంటున్నాయి. ఇద్దరూ తమ ఆలోచనలను పంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో శివాజీ ఏ పార్టీనీ వదలకుండా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే పవన్ ను మాత్రం ఆయన ఎప్పుడూ విమర్శించకపోగా, పలుమార్లు ప్రశంసలతో ముంచెత్తాడు. పవన్ తలుచుకుంటే ఏపీకి మూడు నెలల్లో ప్రత్యేక హోదా వస్తందని, ఇప్పటి రాజకీయాలకు పవన్ లాంటి నాయకుడు ఎంతో అవసరమని ఆయన ఇంతకుముందు వ్యాఖ్యానించాడు. దీంతో శివాజీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో పవన్ ఉన్నాడు. అందుకే ప్రత్యేక హోదా సాధనకై చేసే పోరాటంలో శివాజీని కూడా కలుపుకుపోవాలని పవన్ భావిస్తున్నాడట. ఇక ఈనెల 9న కాకినాడలో పవన్ ఓ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో శివాజీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి ఈ యవ్వారం ఎటు తేలుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:ర్యాంప్ వాక్ లో సీఎం వైఫ్

ఇవి కూడా చదవండి:ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ అవసరం లేదు

`

English summary

Hero Sivaji who was fighting to get Special Status to Andhra Pradesh and many times he commented on every political party leaders. According to sources known that Pawan Kalyan made a call to Sivaji and met secretly.