శని వున్నవారు ఈ పత్రాలతో శివుడ్ని పూజిస్తే శని పోతుందట!

Sivudni ee pathraalatho poojisthe sani pothundi

10:47 AM ON 30th August, 2016 By Mirchi Vilas

Sivudni ee pathraalatho poojisthe sani pothundi

బిల్వ పత్రాలతో శివుణ్ని పూజిస్తే మంచిదని తెలుసు కదా! మరి శనిదోషం ఉన్నవారు బిల్వపత్రాలతో శివుణ్ని పూజిస్తే ఆ దోషం పరిహారం అవుతుందని అంటారు అది తెలుసా? ఈ విషయాన్ని స్వయంగా శివుడే చెప్పాడట. అసలు విషయంలోకి వెళ్తే... ఓసారి శివుణ్ని దర్శించుకోవడానికి శనీశ్వరుడు కైలాసం చేరుకుని, పార్వతీ పరమేశ్వరులను భక్తితో ప్రార్థించాడు. అయితే పరమేశ్వరుడికి ఎందుకో శనిని పరీక్షించాలనిపించింది. దీంతో నేను ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా నీవు గుర్తించగలవా అని శనిని ప్రశ్నించాడు. మీ అనుగ్రహం ఉన్నంత కాలం మీరు ఏ రూపంలో ఉన్నా గుర్తుపట్టగలనని శని బదులిచ్చాడు.

1/3 Pages

అయితే నేను ఎక్కడ ఉండేది కనిపెట్టి, నన్ను పట్టుకో చూద్దాం అని శివుడు శని దేవుడికి పరీక్ష పెట్టాడట. మరుసటి రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించేలోగా మిమ్మల్ని పట్టుకుంటానని శని శివుడికి చెప్పాడు. దీంతో శనికి దొరక్కుండా ఎక్కడ దాక్కోవాలా, అని తెగ ఆలోచించిన శివుడు చివరకు సూర్యోదయ సమయంలో బిల్వ వృక్ష రూపంలోకి మారాడు. సాయంత్రం తర్వాత శివుడు బిల్వ వృక్షం రూపాన్ని విడిచి తన అసలు రూపాన్ని ధరించాడు. వెంటనే శివుడితోపాటే శని కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శనీ నన్ను పట్టుకోలేకపోయావుగా? అని పరమేశ్వరుడు శనితో అన్నాడట.

English summary

Sivudni ee pathraalatho poojisthe sani pothundi. Sivudni bilwa pathraalatho poojisthe sani tholagipothundata.