తమిళ్ లో కూడా 'బాహుబలి' కి ఇన్ని అవార్డులా!!

Six awards for Baahubali tamil version

05:09 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Six awards for Baahubali tamil version

రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా 'బాహుబలి'. తెలుగు సినిమాల ఘనతని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ సినిమాని తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషలలోకి కూడా డబ్ చేశారు. ఇప్పటివరకూ ఈ సినిమా చాలా రికార్డులను కొల్లగొట్టింది. ఇంకా రికార్డులను సాధిస్తూనే ఉంది. ఇండియన్‌ ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్‌(ఐఫా) ఉత్సవంలో తొలిసారి అరడజన్‌ అవార్డులు బాహుబలికే సొంతమయ్యాయి. బాహుబలి తమిళ వెర్షన్‌ కు ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ సహాయనటి, ఉత్తమ గాయకులు మేల్‌, ఉత్తమ గాయకులు ఫీమేల్‌, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రంగా బాహుబలి ఆరు అవార్డులను సొంతం చేసుకుంది.

బాహుబలి మొదటి పార్ట్‌ ఇన్ని రికార్డులు సొంతం చేసుకుంటే బాహుబలి రెండవ పార్ట్‌ ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

English summary

Indian International Film Award(IIFA) gave 6 awards to Baahubali tamil version. Best Character Artist Male, Best Character Artist Female, Best Singer Male, Best Singer Female, Best Director, Best Film. Baahubali nominated for these 6 awards.