'స్పీడున్నోడు' ఆడియో ఫంక్షన్‌లో హీరోయిన్ల సందడి!!

six heoines came for Speedunnodu audio launch

04:00 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

six heoines came for Speedunnodu audio launch

బెల్లంకొండ సురేష్‌ తాజాగా నటించిన 'స్పీడున్నోడు' సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఆడియో ఫంక్షన్ లో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు హాజరయ్యారు. ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ కాస్తా గ్లామర్‌ ఫంక్షన్‌గా మారిపోయింది. ఏ సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌కైనా సినిమాలో నటించిన నటీనటులు హాజరవుతారు. కానీ 'స్పీడున్నోడు' సినిమాకి మాత్రం ఆరుగురు హీరోయిన్లు హాజరవ్వడం విశేషం. అయితే స్పీడున్నోడు హీరోయిన్‌ సోనరిక భడోరియా మాత్రం ఈ ఫంక్షన్‌ కి హాజరవ్వలేదు. అందుకే హీరోయిన్‌ లేని లోటుని భర్తీ చేసేందుకు అరడజన్‌ హీరోయిన్లను వేడుకకు పిలిచారు.

ఈ సినిమాలో ఐటెంసాంగ్‌ చేసిన తమన్నా అందంగా ముస్తాబై వచ్చేసింది. యంగ్‌ హీరోయిన్లుగా ఇండస్ట్రీలో మెరిసిపోతున్న హీరోయున్లు ఈ ఆడియో ఫంక్షన్లో సందడి చేశారు. రెజీనాకసాండ్రా, రకుల్‌ప్రీత్‌సింగ్‌, కేథరిన్ త్రెస, తేజస్విని, సాక్షిచౌదరి, తమన్నాలు ఈ ఫంక్షన్‌కి వచ్చారు. వీళ్ళందరి మధ్యలో బెల్లంకొండ శ్రీనివాస్‌ చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోయాడు.

English summary

six heoines came for Speedunnodu audio launch. Tamanna, Sakshi Choudary, Catherine Tresa, Regina Cassandra, Rakul Preet Singh, Hebah Patel came to this audio function. Bheemaneni Srinivasa Rao directed this movie.