చెట్టులో ఆస్థిపంజరం

Skeleton discovered in tree

05:12 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Skeleton discovered in tree

ఆస్థిపంజరం ఏంటి చెట్టేమిటి అనుకుంటున్నారా... అవును చెట్టు లో ఆస్థిపంజరం లబించింది. ఆ ఆస్థిపంజరం ఇప్పటిది అనుకుంటే మీ పొరపాటే. అది మధ్యయుగం నాటి ఆస్థిపంజరం. వివరాల్లో కి వెళితే ఐర్లాండ్ లో జరిగిన త్రవ్వకాలలో దొరికిన ఆస్థిపంజరాన్ని పురావస్తు శాఖ వారు మద్యయుగం నాటి ఆస్థిపంజరం గా గుర్తించారు. 215 సంవత్సరాలు కలిగిన చెట్టు వేర్ల లో ఈ ఆస్థిపంజరం దొరకడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంవత్సరం లో సంభవించిన భీకర తుఫాన్ కారణం గా 215 వయస్సు కలిగిన చెట్టు కుప్ప కూలిపోయి వేర్లతో సహా భూమిని పెకలించుకుని రావడం తో ఈ ఆస్థిపంజరం కధ వెలుగులోకి వచ్చింది.ఆ అవశేషాలను విశ్లేషించడానికి పురావస్తు నిపుణులు వాటిని సేకరించడం తో కొన్ని విషయాలు బయటపడ్డాయి.

హింసాత్మకం గా ఎవరో అతనిని హత్య చేశారని అతడి ఛాతి మీద కత్తి పోట్లు ఉన్నాయని, అలాగే ఎడమ చేతి కి కూడా గాయం ఉందని తనని తాను రక్షించుకునే ప్రయత్నం లో ఈ గాయమై ఉంటుంది అని పరిశొదనల ద్వారా తేలింది. ఆ వ్యక్తి కి సుమారు 17 నుండి 20 ఏళ్లు ఉండవచ్చు.ఇది జరిగి దాదాపు 900 నుండి 1000 సంవత్సరాలు అవుతుంది. అతడు 5 అడుగుల 10 అంగుళాలు పొడుగు ఉండవచ్చని వారి భావన. అతడి మరణం ఎలా సంభవించిందో ఎవరికీ తెలియదు. బహుశా యుద్ధ పోరాటం లోనో లేక వ్యక్తిగత కారణాలవల్ల జరిగిన హత్యో అని కొందరి అబిప్రాయం.

English summary

Skeleton discovered in tree. Experts says medieval skeleton discovered in tree. He suffered violent death.