అందానికి కాదు సత్తాకు ఉద్యోగం ఇవ్వాలన్న అమ్మాయి .. ఇంతకీ ఏమైందో తెలుసా

SkillsNotScars Video By Acid Victim Sapna

11:04 AM ON 20th December, 2016 By Mirchi Vilas

SkillsNotScars Video By Acid Victim Sapna

కొన్ని కొన్ని ప్రశ్నలు అర్ధం కావు. మరికొన్ని ఆలోచింప జేస్తాయి. ఓ అమ్మాయి నిర్ణయం కూడా అందరినీ ఆలోచింపజేస్తోంది. అందుకే నెట్ లో వైరల్ గా మరి హల్ చల్ చేస్తోంది. కామెంట్లు కూడా అదిరిపోతున్నాయి. పూర్తివివరాల్లోకి వెళ్తే, పది సంవత్సరాల క్రితం జరిగిన ఘటనతో 23 ఏళ్ల సప్న జీవితం ఒక్క సారిగా తలక్రిందులైంది. అప్పుడే స్కూల్ లైఫ్ పూర్తి చేసుకున్న సప్నకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు ఈ మేరకు ఓ సంబంధం కూడా ఖాయం అనుకున్నారు.. కానీ ఉన్నత చదువులు చదవాలనే కోరికతో పెళ్లికి నో చెప్పింది సప్న, ఈ సమయంలోనే మరో అబ్బాయితో క్లోజ్ గా ఉంటున్న సప్న మీద ఆమె సమీప బంధువు, ఒంటరిగా వెళుతున్న సమయంలో యాసిడ్ తో దాడి చేశాడు. దీంతో సప్న విలవిల్లాడుతూ అక్కడే పడిపోయింది.

ఇక సీన్ కట్ చేస్తే.. 10 ఏళ్లుగా నరకం అనుభవించిన సప్న, తనలా ఎవరు బాధపడకూడదని నిర్ణయం తీసుకుంది. తనలా బాధపడే యాసిడ్ బాధితులనందరిని ఒక్క చోటకు చేర్చి ఉద్యోగాలను తమ దరికి తీసుకు వచ్చేలా చేస్తోంది. ఉన్నత చదువులతో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆరాటపడి, అనూహ్య రీతిలో ‘యాసిడ్ రక్కసి’కి బలైపోయిన వారికి ఓ దారిని చూపించే నిర్ణయం తీసుకుంది. అందుకోసం మేకిన్ లవ్ నాట్ స్క్వార్ అనే టైటిల్ తో ప్రపంచంలోనే తొలిసారిగా యాసిడ్ బాధితుల జాబ్ పోర్టల్ ను సిద్దం చేసింది. #SkillsNotScars అనే నినాదంతో దూసుకుపోతున్న ఈ పోర్టల్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకోసం తను రూపోందించిన వీడియో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారి ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది.

ఇవి కూడా చదవండి: దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు ఉరి

ఇవి కూడా చదవండి: ప్రముఖ బిలియనీర్ కూతురు కొన్న బిల్డింగ్ ఖరీదు తెలిస్తే దిమ్మ తిరుగుద్ది

English summary

Acid Victim Sapna was popular all over India and she attracted so many people around the world and she also started a new job portal for the victims like her and now she released a video with a hash tag of #SkillsNotSacrs and now this video was going viral all over the internet.