స్కైప్‌లో గ్రూప్ వీడియో కాలింగ్ చేస్కోండి

Skype Group Video Calling Feature

03:39 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Skype Group Video Calling Feature

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇకపై మీరు స్కైప్‌లో గ్రూప్ వీడియో కాలింగ్ సులువుగా చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఈ సదుపాయం బిజినెస్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా ఇప్పుడది సాధారణ వినియోగదారులకు లభిస్తోంది. ప్రస్తుతం ఈ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే యూజర్లు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అతి త్వరలోనే ఈ సదుపాయాన్ని ఉచితంగా అందజేయనున్నట్టు స్కైప్ ప్రతినిధులు తెలిపారు. ఈ కాలింగ్ సౌకర్యం ద్వారా యూజర్లు 25 మందితో ఒకేసారి గ్రూప్ వీడియో కాలింగ్ చేయవచ్చు. గూగుల్ హ్యాంగవుట్స్‌లో ఇదే ఫీచర్ ద్వారా 10 మంది వరకు గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకునే సదుపాయం ఉండగా స్కైప్ దీన్ని 25కు పెంచి అందిస్తోంది. స్కైప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు దాదాపు 2 లక్షల కోట్ల నిమిషాల ఉచిత వీడియో కాల్స్ చేసుకున్నారని స్కైప్ బృందం తెలిపింది. ఈ నేపథ్యంలోనే తమ వినియోగదారులకు మరిన్ని ఫీచర్లను అందజేయాలని సంకల్పించామని, అందుకే గ్రూప్ వీడియో కాలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని వారు పేర్కొన్నారు.

English summary

Skype released a new feature for its individual users that they can do group video call, upto now this group video call feature was available only for business users.