కడుపులో పేగుల స్పూర్తితో స్మార్ట్ ఫోన్ బ్యాటరీ తయారీ!

Smart phone battery made by inspiration of human entrails

11:14 AM ON 28th October, 2016 By Mirchi Vilas

Smart phone battery made by inspiration of human entrails

రకరకాల స్మార్ట్ ఫోన్లు రంగ ప్రవేశం చేస్తున్నాయి కదా. ఇక మన కడుపులోని పేగులు సరికొత్త స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఆవిష్కరణకు దారి తీసింది. ప్రస్తుత లిథియం అయాన్ బ్యాటరీల కన్నా.. మరింత సమర్థమైన లిథియం సల్ఫైడ్ బ్యాటరీల తయారీకి అడ్డంకిని తొలగించాయి! పేగు నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకున్న యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త వసంత కుమార్ బృందం కొత్త లిథియం సల్ఫైడ్ బ్యాటరీని రూపొందించింది. లిథియం సల్ఫైడ్ బ్యాటరీల్లో సల్ఫైడ్ పదార్థం త్వరగా క్షీణించిపోవడం ప్రస్తుతం ప్రధాన అడ్డంకిగా మారింది. దీనికి పరిష్కారం కోసం చైనాలోని బీజింగ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులతో కలిసి వసంత బృందం పరిశోధనలు చేసింది.

కడుపులో జీర్ణమైన ఆహారాన్ని గ్రహించి, రక్తంలోకి పంపేందుకు మన పేగుల లోపలి గోడలపై చిన్నచిన్న వేళ్లలాంటి చూషకాలు ఉంటాయి. జీర్ణమైన ఆహారాన్ని బాగా శోషించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ విధానాన్ని ప్రేరణగా తీసుకున్న శాస్త్రవేత్తలు, లిథియం సల్ఫైడ్ బ్యాటరీలో పేగు చూషకాల మాదిరిగా ఉండే పాలీ సల్ఫైడ్ నిర్మాణాలతో కూడిన పొరను అమర్చారు. దీంతో ఈ బ్యాటరీలో సల్ఫర్ అణువులను మళ్లీ మళ్లీ వాడుకునేందుకు వీలు ఏర్పడిందని, ఫలితంగా బ్యాటరీ సామర్థ్యం పెంచేందుకు ఉన్న ఆటంకం తొలగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారతీయ సంతతి శాస్త్రవేత్త ప్రయోగానికి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

English summary

Smart phone battery made by inspiration of human entrails