99 రూపాయలకే స్మార్ట్‌ఫోన్‌

Smartphone for only 99 rupees

05:19 PM ON 18th May, 2016 By Mirchi Vilas

Smartphone for only 99 rupees

ఇది కల కాదు నిజమే.. కేవలం 99 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ని మీ సొంతం చేసుకోండి. ఇంతకీ ఏంటా ఫోన్ అనే ప్రశ్న మీలో మెదులుతుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం మేటర్ లోకి వెళ్లిపోదాం పదండి.. నమోటెల్‌ డాట్‌కామ్‌ సంస్థ అరుదైన రీతిలో 99 రూపాయలకే అచ్చేదిన్ పేరిట స్మార్ట్‌ఫోన్‌ను పంపిణీ చేస్తామని ప్రకటించింది. నగరంలో మంగళవారం నమోటెల్‌ కంపెనీ సీఈఓ మాధవరెడ్డి ప్రెస్‌క్లబ్‌లో వివరాలు ప్రకటించారు. స్మార్ట్‌ఫోన్‌ను పొందదలిచిన వారు బి మై బ్యాంకర్‌(BeMyBanker.com) డాట్‌కామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఐడి, పాస్‌వర్డ్‌ను పొందాలన్నారు.

ఇందులో లాగిన్ అయ్యాక ఆన్‌లైన్ రూపంలో నగదు చెల్లించాలి. ఆ తర్వాత బీఎంబీ రెఫరెన్స్ ఐడి అందుతుంది. వాటి ఆధారంగా నమోటెల్‌ డాట్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఫోటో, ఆధార్‌కార్డును జతచేస్తే స్మార్ట్‌ఫోన్‌ను సరఫరా చేస్తామన్నారు. బి మై బ్యాంకర్‌లో సభ్యుడిగా చేరితే మాత్రమే నోవాటెల్‌లో రిజిస్ట్రేషన్ సాధ్యమన్నారు.

English summary

Smartphone for only 99 rupees. BeMyBanker website providing Namotel smartphone for 99 rupees only.