స్మార్ట్ ఫోన్ పింకీ.. యమా డేంజర్

Smartphone Pinky Disease To SmartPhone Users

10:42 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Smartphone Pinky Disease To SmartPhone Users

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ స్మార్ట్ ఫోన్.. అందుకే ఎవరి చేతిలో చూసినా ఇప్పుడు అదే కనిపిస్తుంది. కానీ అయితే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ యూజర్లకు టెన్షన్ విషయం ఒకటి వెల్లడైంది. అరచేతిలోనే ప్రపంచాన్ని చూపించే స్మార్ట్‌ఫోన్స్ ఇప్పుడు ప్రయోజనాల కంటే ప్రమాదమే ఎక్కువగా ఉందని ఆస్ట్రేలియాకు చెందిన కర్టిన్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. స్మార్ట్‌ఫోన్ యూజర్ల పై పరిశోధకులు తాజాగా చసిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. రోజూ 6 గంటల కన్నా ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్‌ పై వేళ్లు ఆడించేవారికి స్మార్ట్‌ఫోన్ పింకీ అనే వ్యాధి సోకుతుందని వీరు చెపుతున్నారు. అదేపనిగా స్మార్ట్‌ఫోన్‌లో చాటింగ్, బ్రౌజింగ్ చేయడం వల్ల కొన్నాళ్లకు చేతివేళ్లు ఒంగిపోయి ఫోన్ వాడకుండానే వాటికవే కదులుతూ ఉంటాయట. ఒకవేళ వాటిని వంచడానికి ప్రయత్నించినా మళ్లీ యధాస్థానానికి వెళ్లి పోయి కదులుతూ ఉంటాయట. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ పింకీ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే.. కాస్త జాగ్రత్త పడాల్సిందే. లేకుంటే కష్టాలు పడాల్సిందే. బీ కేర్ ఫుల్..

English summary

A new Smartphone disease was found named Smartphone Pinky.Smartphone pinky” - a perceived bend in the little finger on one’s dominant hand - may occur is people who use the device for at least six hours a day.