ఒక్కసారి చార్జ్.. వన్ వీక్ యూజ్

Smartphones With 7-Day Battery Backup

11:56 AM ON 11th February, 2016 By Mirchi Vilas

Smartphones With 7-Day Battery Backup

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోనే. అయితే సెల్ ఫోన్ చార్జింగే పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే చార్జ్ పెడింగ్ ఒక్క రోజు కూడా రావడం లేదు. దీనికి ఇప్పుడు ఒక యూకే కంపెనీ మందు కనిపెట్టింది. ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే వారం రోజులు ఛార్జింగ్‌ ఉండే స్మార్ట్‌ఫోన్లను తయారుచేస్తోంది. ఇందుకోసం మొబైల్‌ డివైజెస్‌లో పనిచేసేలా ఫ్యుయల్‌ సెల్స్‌ను అభివృద్ధి చేసింది. ఎంబడెడ్‌ ఫ్యుయల్‌ సెల్‌ టెక్నాలజీతో రూపొందిస్తున్న ఈ బ్యాటరీల ద్వారా ప్రస్తుతం పనిచేసే లిథియం అయాన్‌ బ్యాటరీల పరిమితులను అధిగమించవచ్చని కంపెనీ వెల్లడించింది. ఎక్కువ రోజుల పాటు ఛార్జింగ్‌ ఉండడానికి హైడ్రోజన్‌ ఫ్యుయల్‌ సెల్స్‌ను ఉపయోగిస్తున్నారు. దీనిని ఫోన్‌లో ఇంటిగ్రేట్‌ చేయడం వల్ల డివైజ్‌లో ఛార్జింగ్‌ ఎక్కువ కాలం ఉండడంతో పాటు, పవర్‌ బ్యాకప్‌ కూడా చేయవచ్చని కంపెనీ తెలిపింది. అయితే ఫ్యుయల్‌ సెల్‌ను తరచూ హైడ్రోజన్‌తో నింపాల్సి ఉంటుందని వెల్లడించింది.

English summary

A British fuel-cell developer has invented a new battery that gives 7 days battery back up for your Smartphone.The technology converts hydrogen into electricity, leaving only water vapor as a by product. They says that embedding fuel-cell technology into portable devices provides a solution to the current dilemma of battery life.