'శతక'బాదిన స్మిత్,వోజస్‌

Smith and Voges Centuries

06:54 PM ON 17th November, 2015 By Mirchi Vilas

Smith and Voges Centuries

పెర్త్‌: ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌మ్యాచ్‌లో పరుగుల వరద పారుతుంది. న్యూజిలాండ్‌ ఆటగాడు రాస్ టేలర్‌(374 బంతుల్లో 290; 43 ఫోర్లు) ద్విశతకం చేసి పరుగుల వరద పారిస్తే, ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవన్ స్మిత్‌ (170 బంతుల్లో 131 బ్యాటింగ్‌; 17 ఫోర్లు) వోజస్‌ (180 బంతుల్లో 101 బ్యాటింగ్‌; 15ఫోర్లు) కలిసి శతకాలతో పరుగుల సునామి సృష్టిస్తున్నారు. న్యూజిలాండ్‌ 153.5 ఓవర్లలో 624 పరగులతో తొలి ఇన్నింగ్స్‌ను ముగించిగా, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ముగిసే సరికి 258/2 పరుగులతో 193 పరుగుల ఆధిక్యంతో ఉంది. న్యూజిలాండ్‌ ఆటగాడు రాస్‌టేలర్‌ తృతిలో ట్రిపుల్‌ సెంచరీ చేజార్చుకున్నాడు.

English summary

Smith and Voges Centuries. Australia cricketers Steven Smith and Adam Voges did centuries in second test against Newzealand.