కిలిక్కి బాహుబలి స్మిత

Smitha's Baha Kilikki Bahubali Song Released

07:27 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Smitha's Baha Kilikki Bahubali Song Released

తెలుగు పాప్‌ సింగర్‌ స్మిత ఇంతకు ముందు తన ఆల్బమ్‌లలో తెలుగు ప్రేక్షకులను అలరించిది. స్మిత నుండి కొత్త ఆల్బమ్‌ వచ్చి చాలాకాలం అయ్యిందనే చెప్పాలి. తాజా స్మిత 'బాహ కిలిక్కి' అనే ఆల్బమ్‌ను విడుదల చేసింది. బాహుబలి సినిమాలోని కిలికి భాష ఆధారంగా తీసిన ఈ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చెయ్యగా దానికి మంచి స్పందన లభిస్తోంది.

ఈ ఆల్బమ్‌లో బాహుబలి సినిమాలో విలన్‌గా కాలకేయ పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాకర్‌ ఈ పాటలో నటించాడు. మొత్తం మూడున్నర నిమిషాల నిడిని గల ఈ వీడియోకు మంచి స్పందన లభిస్తోంది.

ఈ పాటకు ప్రముఖ దర్శకుడు దేవకట్టా కాన్సెప్ట్‌ ను అందించగా అచ్చు మ్యూజిక్‌ అందించాడు. కొరియోగ్రాఫర్‌గా బాస్కో సినీమాటోగ్రాఫర్‌ గా సమీర్‌రెడ్డి ,ఆర్ట్‌ డైరెక్టర్‌ గా మురళి, ఎడిటింగ్‌ను అదేల పిరీరా వంటి వారు పని చేసారు.

మొత్తానికి కిలికి భాషలో ఉన్నట్లున్న ఈ పాటను 'బాహ కిలిక్కి-ట్రీబ్యుట్‌ టూ టీం బాహుబలి' అనే పేరు పెట్టి విడుదల చేసిన ఈ వీడియోతో స్మిత పూర్వవైభవం దక్కించుకోవాలని చూస్తుందట.

ఈ కిలికి వీడియోను మీరూ ఓసారి చూడండి

English summary

Telugu Pop Singer Smitha Released a Video Named "Baha Kilikki - Tribute to Team Baahubali" . Recently this video was trending in Youtube