అది పొగ రహిత గ్రామం 

Smoke free village was in A.P

11:41 AM ON 31st December, 2015 By Mirchi Vilas

Smoke free village was in A.P

ఆ ఊళ్ళో అసలు కట్టెల పొయ్యి కనిపించదు. ఒకప్పుడు కట్టెల మీద సాగే వంట ఇప్పుడు గ్యాస్ పొయ్యికి మారింది. ఊరు ఊరంతా గ్యాస్ పొయ్యి లను వాడుతున్నారు. దీంతో అక్కడ పొగ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పొగ రహిత గ్రామంగా మారింది. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ఆ గ్రామం ఇంతకీ ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో. ఆ ఊరి పేరు కేతరాజుపల్లి .

వివరాలలోకి వెళితే, కేతరాజుపల్లిలో కొన్నాళ్ళల క్రితం వరకు కట్టెల పొయ్యిలు దర్శనమిచ్చేవి. ఫలితంగా వచ్చే పొగవల్ల రోగాల బారిన పడే ప్రమాదం గుర్తించి , అందరికీ గ్యాస్ కనెక్షన్లు వచ్చేలా చర్యలు చేపట్టారు. అందరిలో అవగాహన పెంచడం వలన స్థోమత వున్నవాళ్ళు గ్యాస్ కొనుకున్నారు. కొందరికి దీపం పధకంలో గ్యాస్ కనెక్షన్ లు అందించారు. ఫలితంగా ఆ ఊళ్ళో ఏ ఇంట్లో చూసినా గ్యాస్ కనెక్షన్లే. దీంతో పొగ రహిత గ్రామంగా ప్రకటించారు. ఇంకేముంది అరుదైన రికార్డు సాధించింది.

English summary