వక్రీకరణ తగదన్న ఇరాని

Smriti irani responds on rohith suicide

05:34 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Smriti irani responds on rohith suicide

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బుధవారం స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్య ఘటనను వక్రీకరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వర్సిటీలో దళితులు, దళితేతరుల మధ్య వివాదం కానే కాదని ఆమె స్పష్టం చేసారు. కోర్టు ఆదేశాల మేరకే విశ్వవిద్యాలయం కమిటీని నియమించిందని, కమిటీ నివేదిక మేరకే విశ్వవిద్యాలయం అయిదుగురు విద్యార్థులపై చర్యలు తీసుకుందని ఆమె వివరించారు. విద్యార్థుల సస్పెన్షన్ పైన స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిందని కేంద్రమంత్రి స్మృతి చెప్పారు. అయితే రోహిత్ వేముల ఆత్మహత్య బాధాకరమని స్మృతి ఇరానీ విచారం వ్యక్తంచేసారు.
ఈ సందర్భంగా స్మృతి ఇరానీ, వేముల రోహిత్ రాసిన సూసైడ్ నోట్‌ను కొంత చదివి వినిపించారు. స్థానిక సమస్యల విషయమై లేఖలు పంపించడం.. కేవలం బండారు దత్తాత్రేయ మాత్రమే చేయలదేని ఆమె పేర్కొంటూ, గతంలో కాంగ్రెస్ ఎంపీ వి హనుమంత రావు కూడా లేఖ రాశారని చెప్పారు. 17 నవంబర్ 2014 కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి హనుమంత రావు యూనివర్సిటీలోని హత్యలపై కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. విహెచ్ లేఖ పై వ్యవహరించినట్టే దత్తాత్రేయ లేఖ పై కూడా స్పనిదిన్చినట్లు ఆమె చెప్పారు.

English summary

Smriti irani responds on rohith suicide.