దొంగ బంగారం వల్ల మన దేశం ఎంత నష్టపోతుందో తెలుసా?

Smuggling Gold in our country

03:10 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Smuggling Gold in our country

తరచుగా ఎయిర్ పోర్టుల్లో బంగారం పట్టుబడిందనే వార్తలు వస్తుంటాయి. ఎక్కువ సార్లు గ్రాముల్లో అరుదుగా కేజీల్లో కూడా దొంగ బంగారం పట్టుబడుతోంది. ఎందుకిలా బంగారాన్ని దొంగతనంగా తీసుకు వస్తున్నారు? దేశంలోకి వచ్చే బంగారంలో ఎంత మొత్తం ఈ స్మగ్లింగ్ ద్వారా వస్తోంది? అనే ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. మన దేశంలో కేజీ బంగారం కూడా ఉత్పత్తి కాదు. కానీ మనం మాత్రం ఏడాదికి 8 లక్షల నుంచి 10 లక్షల కేజీల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఈ బంగారం వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు. మహిళలకు కాస్త ఆనందాన్ని ఇస్తుందేమో గానీ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి మేలు చేయదు.

ఇది కూడా చదవండి: తన తండ్రి గురించి నోరు జారిన జగపతి బాబు(వీడియో)

బంగారం దుకాణాల్లో, ఆభరణాల తయారీలో వచ్చే ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువ. అందువల్ల బంగారం దిగుమతి వల్ల మన దేశానికి తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. బంగారం దిగుమతులు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. కానీ ఏవీ సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. 10 శాతం దిగుమతి సుంకం విధించింది. 1 శాతం ఎక్సైజ్ సుంకం వేస్తోంది. అయినప్పటికీ గోల్డ్ సేల్స్ జోరు మీదున్నాయి. సాధారణంగా ఏ వస్తువు మీదనైనా ట్యాక్స్ ఎక్కువగా వేస్తే.. అది దొంగ మార్గాన్ని ఎంచుకుంటుంది. ప్రస్తుతం దేశంలోకి సిగరెట్లు, బంగారం స్మగ్లింగ్ జోరుగా జరుగుతోంది. సిగరెట్ల మీద ప్రతి బడ్జెట్లో ట్యాక్స్ పెంచుకుంటూ పోతున్నారు. ఫలితంగా వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఇది కూడా చదవండి: భారతీయుడు కి సీక్వెల్

ఇండియాలో అధికారికంగా సిగరెట్లు కొనుక్కోవడం కంటే.. దొంగతనంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే తక్కువ ధరకు సిగరెట్లు లభిస్తున్నాయి. బంగారం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. స్మగ్లింగ్ ద్వారా బంగారాన్ని విదేశాల నుంచి తెచ్చుకుంటే పది శాతం కలిసి వస్తుంది. రూ. లక్షకు రూ.10 వేలు కలిసి వస్తుండటంతో విదేశాల నుంచి వచ్చే వారు రిస్క్ తీసుకుంటున్నారు. వారిలో కొంత మంది ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులకు దొరికిపోతున్నారు. కొంత మంది స్మగ్లర్లు ఎయిర్ పోర్ట్ సిబ్బందితో కుమ్మక్కై స్మగ్లింగ్ చేస్తున్నారు. మన దేశంలో ప్రతి సంవత్సరం 800 టన్నుల నుంచి 1000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది.

ఇది కూడా చదవండి: సొంత చెల్లి పై అత్యాచారం చేసి గర్భవతిని చేసాడు

ఇందులో 15 శాతం స్మగ్లింగ్ ద్వారా వస్తోందని ANZ బ్యాంకు అంచనా వేసింది. స్మగ్లింగ్ జరిగినా సరే.. ప్రభుత్వం.. బంగారం పై దిగుమతి సుంకాన్ని తగ్గించడానికి సుముఖంగా లేదు. దిగుమతి సుంకం తగ్గించకపోగా ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. ఈ ఒక శాతాన్ని ఎత్తేయాలని వారాల తరబడి జ్యుయలరీ షాపులు బంద్ పాటించాయి. అయినా కేంద్రం దిగి రాలేదు. ఏదో ఒక రకంగా బంగారం దిగుమతిని తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కానీ బంగారం మీద భారతీయులకు ఉన్న మోజు.. ఈ ప్రయత్నాలను సఫలం కాకుండా చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: రేపిస్ట్ నాలుక కొరికి తప్పించుకున్నయువతి

బంగారంలో పెట్టుబడి అంటే దాదాపుగా డెడ్ ఇన్వెస్ట్ మెంట్ కిందే లెక్క. ఎందుకంటే ఇన్ ఫ్లేషన్(ద్రవ్యోల్బణం) 10 శాతం ఉంటే బంగారంలో రాబడి 5 శాతం కూడా ఉండదు. ఎప్పుడైనా సరే.. మన పెట్టుబడి మీద రాబడి ఇన్ ఫ్లేషన్ కంటే ఎక్కువగా ఉండాలి. అప్పుడే మన దగ్గర డబ్బు విలువ పడిపోకుండా ఉంటుంది. బంగారాన్ని తక్కువగా కొనడం లేదా అసలు కొనకపోవడం ద్వారా ఈ దేశం మీద భక్తిని చాటుకున్నట్లే. బంగారం దిగుమతి ఎంత తగ్గితే ఆ మేరకు మన విదేశీ మారకపు నిల్వలు పెరుగుతాయి.

ఇది కూడా చదవండి: ఇంట్లో భార్యలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా?(వీడియో)

English summary

Smuggling Gold in our country