షాకింగ్ న్యూస్: నత్త విషం తాగితే ఆ రోగం తగ్గిపోతుందట!

Snail poison is the best medicine for diabetes

03:39 PM ON 3rd October, 2016 By Mirchi Vilas

Snail poison is the best medicine for diabetes

ఇప్పుడు అందరినీ పట్టిపీడించే సమస్య షుగర్ వ్యాధి. వాస్తవానికి ప్రపంచ జనాభాలో సగం మంది బాధపడుతున్న వ్యాధి ఇదే. ఈ వ్యాధి బారిన మృత్యువాతపడుతున్న వారి సంఖ్య నానాటికీ అధికమైపోతోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ వ్యాధి మరింత విజృంభిస్తోంది. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నో పరిశోధనలు చేస్తున్నా ప్రయోజనం మాత్రం నామమాత్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నత్తల విషయంలో చక్కెర వ్యాధికి చెక్ పెట్టొచ్చని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెపుతున్నారు. సముద్రపు నత్త విడుదల చేసే విషంతో చిన్నచిన్న చేపలు క్షణంలో అచేతనమైపోతాయి. దీంతో వాటిని హాయిగా ఆరగించేస్తుంది.

'కోనస్ జియోగ్రాఫస్' అనే ఆ నత్త విషం మధుమేహ రోగులకు అతి శక్తిమంతమైన ఇన్సులిన్ ఔషధంగా కూడా పనిచేస్తుందని ఆస్ట్రేలియాలోని వాల్టర్ అండ్ ఎలీజా హాల్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా నిర్ధారించారు. దీని ఇన్సులిన్ ప్రొటీన్ 3డీ నిర్మాణాన్ని పరిశీలిస్తే, మనుషుల శరీర కణాలు స్వీకరించేందుకు అనుకూలంగా ఉన్నట్లు తేలింది. దీంతో దీనిని ఔషధంగా వాడితే మధుమేహ రోగులకు అతివేగంగా పనిచేసే ఇన్సులిన్ ను అందించేందుకు వీలుగా ఉండగలదని అంటున్నారు.

ఇది కూడా చదవండి: పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే జరిగే అనర్ధాలేమిటి?

ఇది కూడా చదవండి: మీరు చనిపోయినట్టు కల వస్తే దాని వెనక అర్ధం ఏంటో తెలుసా?

ఇది కూడా చదవండి: ఇంట్లో, ఆఫీసుల్లో, బాత్ రూముల్లో అద్దం ఎటువైపు ఉంటే మంచిది?

English summary

Snail poison is the best medicine for diabetes.