పాము కాటుకు గురైన షేన్ వార్న్

Snake Bite To Shane Warne

07:21 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Snake Bite To Shane Warne

ఆస్ట్రేలియన్ దిగ్గజ స్పిన్ బౌలర్ క్రికెటర్ షేన్ వార్న్ పాముకాటుకు గురయ్యారు. ఆస్ట్రేలియాలోని ఒక రియాలిటీ షోకి సెలబ్రిటీ హోదాలో వెళ్లిన షేన్ వార్న్ అనకొండ వంటి ప్రమాదకరమైన పాముతో ఓ ఫీట్ చేయాల్సి వచ్చింది . అసలు మాములుగా పాములంటే భయపడే షేన్ వార్న్ తలకు, శరీరానికి ఎలుకల సెంట్ పూసుకుని అనకొండ వంటి ప్రమాదకరమైన పాములను ఉంచిన బాక్స్‌లో తల పెట్టాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది కాని అకస్మాత్తుగా ఓ చిన్న అనకొండ షేన్ వార్న్‌తల పై కాటు వేసింది . ఆ పాముకు విషం లేకున్నాసరే బలంగా కాటేయడంతో షేన్‌వార్న్‌ శరీరం పై అనకొండ పంటి గుర్తులు ఏర్పడ్డాయి. దీంతో వెంటనే అక్కడి రియాలిటీ షో వారు స్పందించి షేన్ వార్న్‌కు వైద్య చికిత్స అందించారు. అనకొండ కరిచిన తరువాత కూడా వార్న్ ఆ టాస్క్ పూర్తి చేయడం నిజంగా చాలా సాహసంతో కూడుకున్నదని స్టీఫెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం వార్న్ చికిత్స తీసుకుంటున్నాడు.

English summary

Australia spin bowling great Shane Warne has suffered a snakebite after dipping his head into a box full of the reptiles for a reality show.