12 సార్లు పాము కాటు పడింది .. అయినా తట్టుకున్నాడు

Snake Bites 12 Times But He Is Alive

11:22 AM ON 13th September, 2016 By Mirchi Vilas

Snake Bites 12 Times But He Is Alive

కొన్ని సార్లు జరగరానిది జరిగితే, అదే పెద్ద మిరాకిల్. ఇదీ అలాంటిదే. పాము కాటేసిన కొద్దిసేపట్లో చికిత్స చేయకపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం అంటారు కదా. అలాంటిది ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో లేని గ్రామానికి చెందిన లింగరాజ్ అనే యువకుడు గత పదేళ్లలో 12 సార్లు పాముకాట్లను తట్టుకోగలిగాడు. వివరాల్లోకి వెళ్తే, ...

కర్ణాటకలోని విజయపుర ప్రాంతంలో ఉంది అతని గ్రామం. ఇక్కడ మెరుగైన కాదు కదా కనీస వైద్య సదుపాయాలు ఉండవు. దాంతో ఈ గ్రామానికి చెందిన ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లినా పట్టణానికి పరుగులు తీయాల్సిన పరిస్థితి.

దాంతో పాము కరిచినా లింగరాజ్ ఎప్పుడూ ఆస్పత్రికి పరుగులు తీయలేదు. గత పదేళ్లలో పన్నెండు సార్లు పాముకాటేసినా అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పాము కాటేసిన కొద్ది క్షణాలకు స్వల్ప అనారోగ్యానికి గురవ్వడం, ఆతర్వాత మామూలు మనిషి అయిపోవడం జరిగేది. పాము కాటేసినప్పుడల్లా అతని పరిస్థితి ఇలాగే ఉండేది. లింగరాజ్ ను పట్టణంలోని వైద్యులకు చూపిస్తే ఇలాంటి కేసు తామెప్పుడూ చూడలేదన్నారు. పన్నెండు పాము కాట్లకు గురైనా లింగరాజు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు చెప్పారు. ఇది నిజంగా మిరాకిల్ కదా.

ఇది కూడా చూడండి: సీతారామ, లక్ష్మణులు ఎలా చనిపోయారో తెలుసా?

ఇది కూడా చూడండి: శివ పూజకు వాడేవి, వాడకూడనివి ఏమిటో తెలుసా

ఇది కూడా చూడండి: విమానం ఎక్కినప్పుడు ఈ తప్పులు చేస్తే మీరు బుక్కయినట్టే!

English summary

Snake bites 12 times but he is alive his name lingaraju. Lingaraju lives at vijayapuri village in Karnataka.