పుష్కరాల్లో సుమంత్ కి పాము కాటు(వీడియో)

Snake bites a boy in Krishna Pushkaras

11:37 AM ON 16th August, 2016 By Mirchi Vilas

Snake bites a boy in Krishna Pushkaras

కృష్ణా పుష్కరాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ఓ విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం పగడ్బందీగా ఏర్పాట్లు చేసినా ఎక్కడో అక్కడ దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. విజయవాడ దుర్గా ఘాట్ లో పుష్కరస్నానం చేస్తున్న ఓ విద్యార్థికి పాము కాటువేసింది. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పాముకాటుకు గురైన విద్యార్థి విజయవాడ కొత్తపేటకు చెందిన సుమంత్ గా గుర్తించారు. పరిస్థితి విషమంగానే ఉందని అంటున్నారు. కాగా రేపల్లె మండలం పెనుమూడి ఘాట్ లో విషాదం నెలకొంది.

గుండెపోటుతో శ్రీనివాసరావు అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడి స్వస్థలం నగరం మండలం ఏలేటివారిపాలెం వాసిగా గుర్తించారు. అలాగే అమరావతిలో వాహనాల పార్కింగ్ స్థలంలో రమేష్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. రమేష్ పుష్కరస్నానం కోసం సికింద్రాబాద్ నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

English summary

Snake bites a boy in Krishna Pushkaras