ఎయిడ్స్ కి మందు పాము విషమట!

Snake poison is the best medicine for Aids

05:16 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Snake poison is the best medicine for Aids

అవునా, అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎయిడ్స్ బారిన బడి ప్రాణాలు కోల్పోతునారు. అయితే ముల్లుని ముల్లుతోటే తీయాలనే చందంగా ఎయిడ్స్ కి సరైన మందు విషమే నని తేలుస్తున్నారు. అది కూడా పాము విషం... ఇందుకు సంబంధించిన ప్రయోగం ఎక్కడో విదేశంలో కాదు మన ఇండియాలో అందునా హైదరాబాద్ లో జరుగుతోంది... పైగా పాము విషంతో చేసే మందు బానే పనిచేస్తోందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ ద్రువీకరిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఆయుష్ విభాగం దగ్గర బ్రేజిలయన్ జాతికి చెందిన పాము విషం మందుగా అందుబాటులో ఉందట.

ఇది కూడా చదవండి: రావణుడి మరణం తర్వాత మండోదరి జీవితం

కామెర్ల వంటి రోగాలకు ఈ మందును వాడుతున్నారట. అయితే దానికి దీటుగా హెచ్ఐవి పేషంట్ల పై ప్రయోగించడానికి పాము విషంతో మందు రూపొందిస్తున్నారు. ఐఐసిటీ ఈ మేరకు హెచ్ఐవి పేషంట్ ల పై ప్రయోగం చేసింది. అంతే కాదు హైదరాబాద్ రామంతా పూర్ లోని హోమియో క్లినిక్ లో 3 వేల మంది ఎయిడ్స్ బాధితుల పై ప్రయోగాత్మకంగా పరీక్షలు జరుపుతున్నారు. ఇంచుమించు 6 నెలల నుంచి క్లినికల్ ట్రయల్ జరుగుతోంది. సిడి -4 సెల్స్ కౌంట్ ఆధారంగా మందు మోతాదు నిర్ధారిస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెంచే సెల్స్ పెరుగుతున్నట్లు గుర్తించి, 10 మందికి హెచ్ఐవి వైరల్ జీరో స్థాయికి చేరినట్లు కూడా గుర్తించి, కేంద్రానికి నివేదిక పంపారు.

ఇది కూడా చదవండి: ఎయిర్ హోస్టెస్ లు విమానంలో ఆ పనులు కుడా చేస్తారట

పరీక్షలు ఫలితాలు అందజేయాలని కేంద్ర ఎయిడ్స్ నియంత్రణ బోర్డుని కోరారు. ఇది అందుబాటులోకి వస్తే, ఎయిడ్స్ రోగులకు మంచి రోజులు వచ్చినట్లే...

ఇది కూడా చదవండి: ఛీ ఛీ.. ఐఏఎస్ ఇంట్లో టీవీ తారల వ్యభిచారం

English summary

Snake poison is the best medicine for Aids. Snake poison is the best medicine for Aids and Jaundice.