స్నేక్ వైన్ గురించి ఎప్పుడైనా విన్నారా(వీడియో)

Snake Wine in China

11:01 AM ON 9th June, 2016 By Mirchi Vilas

Snake Wine in China

కప్పలు, పాములను అమితంగా తినడంలో చైనీయులు ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు అదే రీతిలో ఒక భయంకరమైన వైన్ ను తయారు చేసి ప్రపంచాన్ని తమ వైపుకి తిప్పుకున్నారు. అయితే దాన్ని భయంకరమైన వైన్ అని ఎందుకు అన్నామంటే దాని గురించి తెలిస్తే కచ్చితంగా భయపడతారు కాబట్టి. రోజు తాగే మందు విసుగెత్తిందేమో కానీ మందులో సరికొత్త ఫార్ములాని కనిపెట్టారు. ఇంక ఈ మందుకి ప్రపంచవ్యాప్తంగా భారీ గిరాఖీ వచ్చేసింది. ఆ స్నేక్ వైన్ వారికెలా ఉన్నా అది చూస్తే మనం మాత్రం భయపడాల్సిందే. అసలు స్నేక్ వైన్ తయారీ విధానానికి వస్తే..

1/5 Pages

తయారీ విధానం:

ముందుగా అత్యంత విషపూరితమైన పాములను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి వైన్ లో వేస్తారు. వాటితో పాటు కొన్ని ఔషధ మూలికలు, మంచి పరిమళం కోసం సుగంధ ద్రవ్యాలను కలుపుతారు. సీసాలో వేసిన పాములను కనీసం 40 రోజులు, మరికొన్నింటిని నెలలు తరబడి నానబెడతారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇందులో కొన్ని రకాల పాములు అప్పటి వరకు బ్రతికే ఉంటాయట. అలా పులియబెట్టిన దానిని కొంత మంది మందు ప్రియులు ఇష్టంగా సేవిస్తారట. ఈ స్నేక్ వైన్ వెన్ను, కీళ్ళ నొప్పులు, జుట్టు రాలడం వంటి సమస్యలకు పాములు ఔషధాలుగా అద్భుతంగా పని చేస్తాయని చైనీయులు నమ్మకం.

English summary

Snake Wine in China