విమానంలో పాములు.. పరిగెట్టిన ప్రయాణికులు(వీడియో)

Snakes on a plane

11:46 AM ON 9th November, 2016 By Mirchi Vilas

Snakes on a plane

విమానంలో పాములు అనే మాట వింటే అందరికీ హడల్. అయితే 'స్నేక్స్ ఆన్ ఎ ప్లేన్' అనే ఇంగ్లిష్ సినిమాలో అనేక పాములు ఓ విమానంలోకి వచ్చి బీభత్సం సృష్టిస్తాయి. ప్రయాణికులు భయంతో పరుగులు పెడతారు. అలాంటి సన్నివేశం సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా చోటుచేసుకుంది. నిజం, మెక్సికో దేశంలోని టోరియాన్ నుంచి మెక్సికో సిటీకి వెళుతున్న ఓ విమానంలో పాములు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఏరో మెక్సికో విమానయాన సంస్థకు చెందిన ఈ విమానం టేకాఫ్ సమయం దగ్గర పడడంతో ప్రయాణికులంతా విమానం ఎక్కి సీట్లలో కూర్చున్నారు. విమానం టేకాఫ్ కు సిద్ధమైంది.

ఇంతలో కొందరు ప్రయాణికులు విమానం పై భాగంలో పాములు వేలాడుతున్నట్లు గుర్తించి భయంతో లేచి పరుగెత్తారు. వారితోపాటు మరికొందరు కూడా విమానం నుంచి కిందికి దిగిపోయారు. కొందరు మాత్రం విమానంలోనే ఉండి పాముల్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఒక పాము అయిదడుగుల పొడవు ఉందని, అది ఏ జాతికి చెందినదో తెలియలేదని అంటున్నారు. అసలు విమానంలోకి పాములెలా వచ్చాయి? ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు? అనే దానిపై ఏరోమెక్సికో ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ వార్త పెద్ద సంచలనమే సృష్టించింది.

English summary

Snakes on a plane