మరిన్ని ఫీచర్లతో స్నాప్‌చాట్‌..

SnapChat App With New Features

05:03 PM ON 26th January, 2016 By Mirchi Vilas

SnapChat App With New Features

ప్రముఖ స్మార్ట్ ఫోన్ యాప్‌ స్నాప్‌చాట్‌ కొత్త సొబగులు అద్దుకుంటోంది. ప్రస్తుతం యాప్ లో ఉన్న ఫీచర్లను మరింత మెరుగుపరిచినట్లు సమాచారం. ముఖ్యంగా వీడియో, ఆడియో కాలింగ్‌, స్టిక్కర్స్‌ను అత్యంత నాణ్యంగా అందించేందుకు స్నాప్ చాట్ ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించకపోయినా ఇంటర్నెట్‌లో ఇందుకు సంబంధించిన సమాచారం హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం ఫోన్‌లోని కాంటాక్ట్స్‌కు కెమెరా రోల్స్‌ నుంచి చిత్రాలు, సందేశాలు పంపుకొనే అవకాశం మాత్రమే ఉంది. ఇంతకు ముందే వీడియో కాలింగ్‌ ప్రత్యేకత ఉన్నా ఒకే సమయంలోనే రెండు వైపులా యూజర్లు తెరను తాకితేనే సాధ్యమయ్యేది. వీటన్నింటినీ మెరుగుపరిచి ఫేస్‌బుక్‌ మెసెంజర్‌కు పోటీగా రంగంలోకి దిగుతోంది స్నాప్‌చాట్‌.

English summary

Snapchat app appears to be working on a new interface and with new features .The new chat interface would make it much easier to send photos or start a video chat with another person