స్నాప్ డీల్ కొంపముంచిన అమీర్ ఖాన్

Snapdeal app uninstall by 1 lakh people due to Amir Khan controversy

04:03 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Snapdeal app uninstall by 1 lakh people due to Amir Khan controversy

అమీర్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలకు సినీ తారలు, రాజకీయ నాయకులే కాకుండా సామాన్య జనం కూడా వాళ్ల నిరసనను వాళ్లకి తోచిన రీతిలో తెలుపుతున్నారు. సెలబ్రిటీలు అయితే వాళ్ల అధికారిక ట్విట్టర్‌, ఫేసుబుక్‌ అకౌంట్ల ద్వారా తెలియజేస్తుంటే ప్రజలు మాత్రం అనూహ్యంగా తెలియజేస్తున్నారు. అమీర్‌ఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన 'స్పాప్‌డీల్‌ యాప్‌ను' లక్షమందికి పైగా ఖాతాధారులు ఉన్నపళంగా తమ మొబైల్ నుండి తొలగించేసారు . కొంత మంది అయితే స్నాప్డీల్ నుండి ఇంకేమి కొననని ట్వీట్ చేశారు. మరొకరు అమీర్‌ఖాన్‌ లేకుండా దేశంలో ప్రజలు బ్రతకగలరు, ఒకవేల అమీర్‌ఖాన్‌ లేకుంటే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానని తెలిపారు.

ఇంకొకరైతే అమీర్‌ఖాన్‌ ముస్లిం కాబట్టి పాకిస్థాన్‌కు వెళ్లిపోవచ్చు, పాకిస్థాన్‌ కూడా అమీర్‌ఖాన్‌ని సాధనంగా ఆహ్వానిస్తాది హిందూస్థాన్‌ని విడిచి పెట్టి వెళ్లడానికి ఇదే అతనికి సరైన సమయం అంటూ ట్విట్‌ చేశాడు. ఇలా ఎంతో మంది వాళ్లకి తోచిన విధంగా అమీర్‌ఖాన్‌ పై రాళ్లు రువ్వుతున్నారు.

English summary

Snapdeal app uninstall by 1 lakh people due to Amir Khan controversy.