స్నాప్ డీల్ దీప్తి కిడ్నాప్ దుండగులు దొరికేసారు

SnapDeal Employee Kidnapped By Psycho

04:07 PM ON 15th February, 2016 By Mirchi Vilas

SnapDeal Employee Kidnapped By Psycho

సన్నిహితుడు పైగా సైకో.కిడ్నాప్ చేసాడా?

ఎన్ని ఎత్తులు వేసినా , పోలిసుల ఎత్తు ముందు చిత్తవ్వక్క తప్పదు. దీన్ని నిజం చేస్తూ, స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా ని కిడ్నాప్ చేసిన దుండగులు పోలీసులకు దొరికిపోయారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో దీప్తిని ఇదే నెల పదో తేదీన గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడంతో దీప్తి స్నేహితుడు వేగంగా స్పందించడం, ఆమె తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవేయడం, వెనువెంటనే పోలీసులకు ఫిర్యాదు, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నేపథ్యంలో 36 గంటల తర్వాత కిడ్నాపర్ల నుంచి దీప్తిని కాపాడారు.

అయితే, దీప్తిని విడిచిపెడుతూ, ఆమెకు అవసరమైన డబ్బును కూడా కిడ్నాపర్లు ఇచ్చి పంపారు. దీంతో ఘజియాబాద్ పోలీసులు కిడ్నాపర్లపై టార్గెట్ చేసి.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటికి చేరుకున్న దీప్తి వద్ద వివరాలు సేకరించిన పోలీసులు. చివరకు ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న దేవేంద్ర అనే సైకోయే ప్రధాన నిందితుడిగా తేలాడు. దేవేంద్రతో పాటు అతడికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైకో మనస్తత్వమున్న దేవేంద్రపై ఇప్పటికే హిస్టరీ షీట్ నమోదు చేశారు.

English summary

Recently a Snapdeal Employee Dipti Sarna was kidnapped by unknown people and later she returned home with bus charges and etc.After that police investigated her and came to know that she was kidnapped by her family friend.