మ్యాగీ  చాలా హాటు గురూ ..!

Snapdeal sold 60 thousand Maggi Packets in Just 5minutes

05:41 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Snapdeal sold 60 thousand Maggi Packets in Just 5minutes

చిన్న పిల్లలు అమితంగా ఇష్టపడే మ్యాగి న్యూడిల్స్ అమ్మకాలు ప్రారంభించిన తొలి రోజే రికార్డ్ లు నెలకొల్పుతున్నాయి .స్నాప్ డీల్ లో ఈ ఉదయం 60 వేల మ్యాగీ ప్యాకెట్లను అమ్మకానికి ఉంచగా కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ( సెకనుకు 200 మ్యగీ పాకెట్లు ) అన్ని పాకెట్లు అమ్ముడవ్వడంతో అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. కస్టమర్లు మ్యాగీ పై తమకున్న ప్రేమను ఈ ఫ్లాష్ సేల్లో చూపించారని స్నాప్ డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టోని నావిన్ తెలిపారు.

ఐదు నెలల తరువాత తిరిగి అమ్మకాలు ప్రారంభం ఐనప్పటికీ ఏ మాత్రం ఆదరణ తగ్గక పోవడం విశేషం . అత్యధిక మోతాదులో సీసాన్ని వాడుతున్నారన్న కారణంగా మ్యాగి న్యూడిల్స్ ను ఇండియాలో నిషేదించిన సంగతి తెలిసిందే. దీంతో 30,000 టన్నుల మ్యాగి ఉత్పత్తిని నెస్లే సంస్థ వెనక్కి తీసుకుంది. అనేక పరీ క్షలు నిర్వహించిన అనంతరం బోంబే హైకోర్ట్ బ్యాన్ ను ఎత్తివేసింది. దీంతో ఇండియాలో మ్యాగి అమ్మకాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అంతే కాక అన్ లైన్ సంస్థ స్నాప్ డీల్ తో మ్యాగి ఒప్పందం కుదుర్చుకున్నసంగతి తెలిసిందే .

English summary

Snapdeal sold 60 thousand Maggi Packets in Just 5minutes