అమీర్ ఖాన్ కు కటీఫ్ చెప్పనున్న స్నాప్‌డీల్‌

Snapdeal To End Contract With Aamir Khan

11:07 AM ON 6th February, 2016 By Mirchi Vilas

Snapdeal To End Contract With Aamir Khan

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌తో తమ బంధానికి ముంగిపు పలకాలని ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్ వెబ్ సైట్ స్నాప్‌డీల్‌ భావిస్తోంది. అమీర్‌ఖాన్‌ ప్రస్తుతం స్నాప్‌డీల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఒప్పందం ఈ నెలాఖరుతో ముగియనుంది. వాస్తవానికి ఈ ఒప్పందాన్ని మరో ఏడాది పొడిగించుకునే అవకాశం ఉంది. అయితే అమీర్‌ఖాన్‌ గతేడాది అసహనంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ ఒప్పందాన్ని ఇంతటితో ముగించాలని స్నాప్‌డీల్‌ భావిస్తోంది. ఈ విషయాన్ని స్నాప్‌డీల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు మీడియాకి వెల్లడించారు. అమీర్‌ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. అమీర్‌కి ఆ స్థాయిని తెచ్చిపెట్టింది భారతేనని అది మర్చిపోకూడదని పలువురు వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ఏ వస్తువులూ కొనవద్దని నెటిజన్లు నిరసన తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో స్నాప్‌డీల్‌ కు కూడా ఆర్థికంగా కొంత మేరకు నష్టం చేకూర్చింది. ఈ నేపథ్యంలో అమీర్ తో బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని స్నాప్ డీల్ నిర్ణయం తీసుకుంది.

English summary

India's famous E-commerce website Snapdeal to end contract with Bollywood Hero Aamir Khan.Previosly Aamir Khan's contreversial words on Intolerance in India has bought loss to Snapdeal.