స్నాప్ డీల్ స్పీడ్‌ కీ డీల్‌

Snapdeal to invest more in logistics

04:58 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Snapdeal to invest more in logistics

దేశీయ ఆన్‌లైన్‌ మార్కెట్‌ దిగ్గజం స్నాప్‌డీల్‌ రవాణా వ్యవస్థ బలోపేతంపై దృష్టిపెట్టింది. ఆర్డర్లను వేగంగా డెలివరీ చేయడానికి చర్యలు చేపట్టింది. అమెజాన్‌ ఇప్పటికే డ్రోన్‌ డెలివరీలపై కన్నేయడం, ఫ్లిప్‌కార్ట్‌ పోటీ పెరగడంతో మెరుగైన సేవలపై స్నాప్ డీల్ దృష్టి సారించింది. సంస్థ సహవ్యవస్థాపకుడు రోహిత్‌ బన్సాల్‌ మాట్లాడుతూ గత సంవత్సరం విస్తరణలో భాగంగా పలు సంస్థలను కొనుగోలు చేశామని, ఇవన్నీ సాంకేతికత, సప్లై ఛైన్‌, చెల్లింపులకు సంబంధించినవే అన్నారు. వీటితో తమ పంపిణీ సమయం 70 శాతం వరకు తగ్గుతుందని చెప్పారు. వేగవంతమైన, చౌకైన పంపిణీ వ్యవస్థ ప్రస్తుత పోటీలో విజయానికి గీటురాయిగా ఉంటుందని ఆయన తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మిగిలిన రంగాల్లో కూడా ఆన్‌లైన్‌ వ్యవస్థను బలోపేతం చేసుకుంటామని చెప్పారు.

English summary